Shiv Sena: ఏక్ నాథ్ మీద వేటువేసిన సీఎం ఠాక్రే, షిండే స్థానంలో చౌధరి, స్పీకర్ గ్రీన్ సిగ్నల్ !
ముంబాయి/గుహవాటి: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ సీనియర్ రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేకి ఆ పార్టీలోని ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతోంది. ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలు సీఎం ఉద్దవ్ ఠాక్రే శిబిరం నుంచి జంప్ కావడానికి సిద్దంగా ఉన్నారని శుక్రవారం వెలుగు చూసింది. ఇలాంటి సమయంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే మీద వేటు వేశారు. శివసేన పార్టీ శాసనసభా పక్షనేతగా సీఎం గ్రూప్ లో ఉన్న అజయ్ చౌధరిని నియమించారు.

క్యూలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు
శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు గుజరాత్ లోని సూరత్ కు, అసోంలోని గుహవాటికి వెళ్లిపోవడంతో మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలోని పెద్దలు షాక్ అయ్యారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి పనిచేసే ప్రసక్తేలేదని రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే తేల్చి చెప్పారు. ఇప్పటికే శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, ఆరు మంది స్వంతత్ర పార్టీ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు దాదాబోసే, సంజయ్ రాథోడ్, ఎమ్మెల్సీ రవీబ్ర పాఠక్ కూడా ఏక్ నాథ్ షిండే గ్రూప్ లోకి వెళ్లడానికి సిద్దం అయ్యారని తెలిసింది.

ఏక్ నాథ్ మీద వేటువేసిన సీఎం
శివసేన రెబల్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి లేఖలు మహారాష్ట్ర గవర్నర్ కు ఇప్పటికే పంపించారు. తనకు సీఎం కావాలని ఆశలేదని ఏక్ నాథ్ షిండే అంటున్నారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఏక్ నాథ్ షిండేకి తగినంత ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇలాంటి సమయంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే శివసేన పార్టీ శాసనసభా పక్షనేతగా ఉన్న ఏక్ నాథ్ షిండేని ఆ పదవి నుంచి తప్పించారు.

అజయ్ చౌధరికి పదవి
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గ్రూప్ లో ఉన్న శివసేన పార్టీ ఎమ్మెల్యే అజయ్ చౌధరిని శివసేన పార్టీ శాసనసభా పక్షనేతగా నియమిస్తున్నామని సీఎం మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కు లేఖ రాశారు. శివసేన పార్టీ శాసనసభాపక్ష నేతగా అజయ్ చౌధరిని తాము గుర్తించామని మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కార్యాలయం నుంచి శివసేన పార్టీకి లేఖ అందిందని ఆ పార్టీ నాయకుడు అంటున్నారు.












Click it and Unblock the Notifications