మహారాష్ట్ర: 48 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల, సకోలి నుంచి పటోలే
వచ్చే నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. 48 మంది అభ్యర్థుల పేర్లతో గురువారం రాత్రి జాబితాను ప్రకటించింది. కరాడ్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను బరిలోకి దించగా, కాంగ్రె పార్టీ రాష్ట్ర చీఫ్ నానా పటోలే సకోలి నుంచి పోటీ చేయనున్నారు.
మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ బ్రహ్మపురి స్థానం నుంచి, మాజీ మంత్రి బాలాసాహెబ్ థోరట్ సంగమ్నేర్ నుంచి పోటీ చేస్తున్నారు. జాబితాలో నాగ్‌పూర్ సౌత్ వెస్ట్‌కు చెందిన ప్రఫుల్ వినోద్‌రావ్ గూడాధే, నాగ్‌పూర్ నార్త్ నుంచి నితిన్ రౌత్, ధారావి నుంచి జ్యోతి ఏకనాథ్ గైక్వాడ్, మలాడ్ వెస్ట్ నుంచి అస్లామ్ ఆర్ షేక్ బరిలో ఉన్నారు.

कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में महाराष्ट्र विधानसभा चुनाव के लिए कांग्रेस उम्मीदवारों की लिस्ट। pic.twitter.com/tElqOKF6ak
— Congress (@INCIndia) October 24, 2024
జయంత్ పాటిల్, అనిల్ దేశ్ ముఖ్, రాజేశ్ తోపే లాంటి కీలక నేతల పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి. అయితే, శరద్ పవార్, అజిత్ పవార్‌ల కుటుంబాల మధ్య మరోసారి పోటీ ఉండటం ఆసక్తికరంగా మారింది.
ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ బారామతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుండగా.. ఆయనపై శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ బరిలో దిగుతున్నారు. యుగేంద్ర పవార్ ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బారామతి ఎంపీ సీటు నుంచి పోటీ కూడా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో శరద్ పవార్ వర్గం నుంచి ఆయన కూతురు సుప్రియా సూలే పోటీ చేయగా.. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేశారు. అయితే, ఈ పోరులో సుప్రియా సూలే విజయం సాధించారు. తాజాగా, అసెంబ్లీ ఎన్నికల్లోనూ బారామతి అసెంబ్లీ స్థానం నుంచి మరోసారి పవార్ కుటుంబసభ్యులే పోటీ పడుతుండటంతో ఆసక్తికరంగా మారింది. కాగా, 288 మంది శాసనసభ స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications