CM: మా నాన్న ఫోటో, మానాన్న పేరు చెప్పుకుని అడుక్కొంటున్న సీఎం, ఫైర్ !
ముంబాయి: మా నాన్న పేరు చెప్పుకుని, మా నాన్న ఫోటో పెట్టుకుని ఓట్లు అడుక్కోవడం కాదు, మీ నాన్న పేరు చెప్పుకుని, మీ నాన్న ఫోటో పెట్టుకుని ఓట్లు అడుక్కోవాలని సిట్టింగ్ సీఎంకు మాజీ సీఎం సవాలు విసిరారు. నేను ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉంటే కొన్ని పనులు చూసుకోవాలని చెప్పినందుకు నన్ను పదవి నుంచి దింపి అడ్డదారిలో సీఎం అయ్యాడని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రస్తుత ఆరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మీద మండిపడ్డారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు నిజమైన దేశద్రోహులు అని మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే మీద రానురాను ఉద్దవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

మానాన్న పేరు చెప్పుకుని అడుక్కొంటున్న సీఎం
మా నాన్న బాలా సాహెబ్ ఠాక్రే పేరు చెప్పుకుని, మా నాన్న బాలాసాహెబ్ ఠాక్రే ఫోటోలు పెట్టుకుని చాలా మంది పెద్దవాళ్లు అయ్యారని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆ రాష్ట్ర సిట్టింగ్ సీఎం ఏక్ నాథ్ షిండేని ఉద్దేశించి విమర్శలు చేశారు. శివసేనకు చెందిన సామ్నాకు ఇచ్చిన ఇంటర్వూలో ఉద్దవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, శివసేన రెబల్ ఎమ్మెల్యేల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

మానాన్న పేరు ఎందుకు ?, మీ నాన్న పేరు చెప్పుకో
మా నాన్న బాలా సాహెబ్ ఠాక్రే పేరు చెప్పుకుని, మా నాన్న బాలా సాహెబ్ ఠాక్రే ఫోటో పెట్టుకుని ఓట్లు అడుక్కోవడం కాదు, మీ నాన్న పేరు చెప్పుకుని, మీ నాన్న ఫోటో పెట్టుకుని ఓట్లు అడుక్కోవాలని మహారాష్ట్ర సిట్టింగ్ సీఎ ఏక్ నాథ్ షిండేకి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సవాలు విసిరారు. సిగ్గుషరం లేకుండా ఇంకా శివసేన పార్టీ గుర్తు పెట్టుకుని తిరుగుతున్నారని ఏక్ నాథ్ షిండే మీద ఉద్దవ్ ఠాక్రే మండిపడ్డారు.

నమ్మక ద్రోహం చేసిన సీఎం
నేను ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉంటే శివసేన పార్టీకి చెందిన కొన్ని పనులు, ప్రభుత్వానికి చెందిన కొన్ని పనులు చూసుకోవాలని ఏక్ నాథ్ షిండేకి చెప్పానని, అలా చెప్పినందుకు నన్ను సీఎం పదవి నుంచి దింపి అడ్డదారిలో ఏక్ నాథ్ షిండే సీఎం అయ్యాడని, షిండే నాకు వెన్నుపోటు పొడిచాడని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రస్తుత ఆరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మీద మండిపడ్డారు ఉద్దవ్ ఠాక్రే విమర్శించారు.

దేశద్రోహులతో పోల్చిన మాజీ సీఎం
మా ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఏక్ నాథ్ షిండే వెంట వెళ్లిన శివసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు నిజమైన దేశద్రోహులు, మాకు, నమ్ముకున్న శివసేన కార్యకర్తలు, ప్రజలకు తీరని ద్రోహం చేశారని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే మీద రానురాను ఉద్దవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications