టీనేజ్ గర్ల్ ని కిడ్నాప్ చేసి రూ. 65 వేలకు అమ్మేశారు

ముంబై: మాయమాటలు చెప్పి బాలికను కిడ్నాప్ చేసి వేరే రాష్ట్రంలో విక్రయించారు. సుమారు నెల రోజులకు పైగా నానా బాధలు పడిన బాలిక చివరికి తప్పించుకుని కుటుంబ సభ్యుల దగ్గరకు చేరింది. బాలికను విక్రయించిన వారిని, కొనుగోలు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.

ముంబైలోని థానే ప్రాంతంలోని ఉలన్ సాగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 14 సంవత్సరాల బాలిక మే 9వ తేదిన కనిపించకుండా పోయింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను కిడ్నాప్ చేసిన నిందితులు మాయం అయ్యారు.

Maharashtra girl abducted, sold in Gujarat

పోలీసులు ఎంత గాలించినా ఫలితం లేకుండ పోయింది. జూన్ 16వ తేదీన బాలిక దాదార్ ప్రాంతానికి చేరుకుని పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న పోలీస్ ఇన్స్ పెక్టర్ మదన్ బళ్లాల్ పూర్తి వివరాలు సేకరించారు. బాలికను విక్రయించిన ఇద్దరు మహిళల గురించి తెలుసుకున్నారు.

వెంటనే పూజా షద్దార్ అలియాస్ రోమ (29), శోభా జాదెవ్ (45) అనే ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఇద్దరు మహిళలు బాలికను తీసుకు వెళ్లి గుజరాత్ లోని భావ్ నగరలో నివాసం ఉంటున్న భరత్ బాయ్ గోవింద్ మక్వాన్ (60) అనే వ్యక్తికి రూ. 65 వేలకు విక్రయించారని వెలుగు చూసింది.

పోలీసులు భరత్ బాయ్ తో సహ ఆటో డ్రైవర్ రాజువాజ (32) అనే ఇద్దరిని అరెస్టు చేశారు. భరత్ బాయ్ ఇంటి నుండి తప్పించుకున్న బాలిక ఒక మహిళ దగ్గర రూ. 500 తీసుకుని రైలులో ముంబై వచ్చిందని, నిందితులు ఇంకా ఎంత మంది బాలికలను విక్రయించారు అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+