మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనే శరణ్యమా..? శివసేనకు గవర్నర్ మరో ఛాన్స్ ఇస్తారా...?

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తప్పదా..? గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేస్తారా .. ? అంటే పరిస్థితిన బట్టి చూస్తే ఔననే అనిపిస్తోంది. బీజేపీ-శివసేన మధ్య పొత్తు బెడిసికొట్టడంతో.. తెరపైకి శివసేన ఎన్సీపీ కూటమి వచ్చింది. బయట నుంచి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నుంచి సంకేతాలు వచ్చాయి. కానీ చివరికి రేపు అనడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

గవర్నర్ భగత్‌సింగ్ కోషియారితో ఆదిత్య బృందం కలిసి తమకు మరో మూడురోజుల సమయం ఇవ్వాలని కోరారు. కానీ అందుకు గవర్నర్ నిరాకరించడంతో రాష్ట్రపతి పాలన తప్పదనే సూచనలు వస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితిని గవర్నర్ కేంద్ర హోంశాఖకు నివేదిస్తారు. కేంద్రం ఆదేశాలతో ప్రెసిడెంట్ రూల్ విధించే అవకాశాలు ఉన్నాయి.

maharashtra goes to president rule ?

గవర్నర్‌తో ఆదిత్య సమావేశమయ్యాక రాష్ట్రంలో సమస్యల గురించి ప్రస్తావించారు. రైతుల సమస్యలు, మౌలిక వసతుల సదుపాయల కల్పన.. తదితర అంశాల గురించి డిస్కష్ చేశారు. దీంతో గవర్నర్ తమకు సమయం ఇవ్వకపోవడంలో పరమార్థం ఆయనకు అర్థమై ఉంటుంది. ప్రస్తుత పరిణామాలను బట్టి గవర్నర్ విచక్షణాధికారం ఉపయోగిస్తారు. అవసరమైతే న్యాయనిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+