'ఫోన్ చేసిన గంట లోపే రక్తం మీ ఇంటి ముందుకి'
ముంబై: సమయానికి రక్తం అందక పోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారిని చాలా మందినే చూస్తున్నాం. ఇలాంటి మరణాల్ని అరికట్టాలన్న ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం "జీవన్ అమృత్ యోజన" పథకాన్ని గత ఏడాది ప్రారంభించింది.
ఈ పథకంపై మహా ఆరోగ్య శాఖ మంత్రి దీపక్ సావంత్ బుధవారం మీడియాతో మాట్లాడారు. గతంలో ఊహించినంత స్పందన లభించలేదని, ఇప్పుడు అలా కాకుండా పూర్తి నెట్ వర్క్‌ని పటిష్టపరిచి పథకాన్ని పునరుద్దరించున్నట్లు ఆయన తెలిపారు.

రక్తం అవసరమైన వారు ఫోన్ చేసిన గంట లోపే అక్కడికి రక్తాన్ని అందించే సౌకర్యాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. ప్రయాణ దూరాన్ని బట్టి రవాణా ఛార్జీల కింద రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేయనున్నట్లు తెలిపారు.
అయితే ఈ ఫోన్ మాత్రం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి వర్గాల నుంచి రావాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం తొందరగా రక్తం అందించేందుకు గాను బ్లడ్ బ్యాంకుల్ని మరింతగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఫోన్ చేస్తే రక్తం అందించే సౌకర్యాన్ని దేశంలో మొట్టమొదటిసారి మహారాష్ట్ర ప్రభుత్వమే ప్రారంభించిందని చెప్పారు.












Click it and Unblock the Notifications