వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా టెన్షన్... గవర్నర్ చేతిలోకి సీఎం సీటు... ఏజీతో సమావేశం అయిన గవర్నర్

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో ఉత్కంఠకు ఆ రాష్ట్ర గవర్నర్ మరింత అజ్యం పోశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియార్‌ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌తో సమావేశం అయ్యారు. ముఖ్యంగా రాజ్యంగ సంక్షోభం రాకుండా పస్తుత పరిణామాలు, చట్టబద్దమైన చర్యలపై అడ్వకేట్ జనరల్‌తో గవర్నర్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా ఈనెల తొమ్మిదిలోగా ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు ఉత్కంఠకు తెరపడడం లేదు. మరోవైపు బీజేపీ నేతలు నేడు గవర్నర్ కలిసి ప్రభుత్వ ఏర్పాటు సిద్దంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం రెండు రోజుల్లో గవర్నర్ తీసుకునే నిర్ణయంపై రాజకీయ ముఖచిత్రం అధారపడి ఉంది.

మహారాష్ట్రలో సీఎం పీఠముడిపై ఇంకా అటు బీజేపీ ఇటు శివసేన మెట్టు దిగడం లేదు. రెండు పార్టీలు ఎవరికి వారే తమ పంతాన్ని నెగ్గించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇరువర్గాల పట్టుదలతో రాజ్యంగ సంక్షోభం తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Maharashtra Governor calls Advocate General

ప్రభుత్వ ఏర్పాటు నవంబర్ 9వరకు అవకాశాలు ఉన్నాయి. కాని ఇప్పటి వరకు పూర్తి స్థాయిబలంలో ప్రభుత్వ ఏర్పాటు ఏపార్టీ అధికారికంగా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే రాజ్యంగ సంక్షోభం రాకుండా గవర్నర్ చర్యలు చెపట్టారు. ఒకవేళ మెజారిటీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ అభ్యర్థిని సీఎంగా ప్రమాణ స్వీకారం చేపట్టిన అనంతరం బలం నిరూపించుకోమని అవకాశం ఇవ్వనున్నారు.

మరోవైపు ఒకవేళ ఈ ప్రయోగం విఫలం అయితే తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రపతి పాలన కూడ విధిస్తారనే సంకేతాలు కూడ వెలువడతున్నాయి. అయితే రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేసేందుకు శివసేన మరియు బీజేపీకి మినహా ఇతరులెవరు ముందుకు రాని పరిస్థితి నెలకోంది.ఈ నేపథ్యంలోనే శివసేనకు మద్దతు ఇచ్చేందుకు ఎన్సీపీ నేతలు ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రాష్ట్ర గవర్నర్ తీసుకునే నిర్ణయంపై రాష్ట్ర రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది.

English summary
Maharashtra Governor Bhagat Singh Koshiyari has called Ashutosh Kumbhakoni, for consultation on the current political situation in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X