సజీవం: తిరుగులేని మోడీ, హర్యానా సీఎం రాజీనామా

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా ఫలితాల ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తిరుగులేని నేతగా నిరూపించుకున్నారు! బీజేపీ, మిత్రపక్ష నేతలు మోడీ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు మోడీ పరిపాలన వల్లనే సాధ్యమైందని చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మాట్లాడుతూ... మోడీ తన పాలన ద్వారా ప్రజలను మెప్పించారని, ఈ ఫలితాలే అందుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.

రెండు రాష్ట్రాల్లో బీజేపీని విజయతీరాలకు చేర్చిన ఘనత మోడీకే దక్కుతుందని అందరు అభిప్రాయపడుతున్నారు. ఆ రాష్ట్రాల్లో బీజేకీ ప్రస్తుతం అగ్రశ్రేణి నాయకులు లేకపోయినప్పటికీ ఆ లోటు కనిపించనీయ లేదు. ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పటికీ స్వయంగా ప్రచారం చేశారు. మహారాష్ట్రలో శివసేనతోనూ, హర్యానాలో స్థానిక పార్టీతోనూ పొత్తుకు చెల్లు చీటి పాడినప్పటికీ ఆ ప్రభావాన్ని పరిమితం చేయగలిగారు. మొత్తంమీద మోడీ వేవ్‌ సజీవంగా ఉందని నిరూపించారంటున్నారు.

లోకసభ ఎన్నికలో తర్వాత దేశంలో మోడీ ప్రభావం తగ్గిందని బాగానే ప్రచారం జరిగింది. బీహార్‌, ఉత్తర ప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీకి తగిన ఎదురుదెబ్బల దృష్ట్యా మోడీ వేవ్‌ బలహీనపడిందన్న వాదనలు తెరమీదరకు వచ్చాయి. అయితే ఆ వాదనలు తప్పని మోడీ మరోసారి నిరూపించారు. ఈ ఎన్నికల ద్వారా మోడీ హవా మరోసారి తేటతెల్లం కావడంతో పాటు, ఉప ఎన్నికలకు సాధారణ ఎన్నికలకు సంబంధం లేదని మరోసారి తేలిపోయిందని అంటున్నారు.

Maharashtra, Haryana win makes Modi invincible

హర్యానాలో బీజేపీ గత ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్లు గెలిచింది. ఇప్పుడు 47 సీట్లు గెలుచుకొని అధికారం చేపడుతోంది. మహారాష్ట్రలో 122 స్థానాలు గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది. శివసేన మద్దతు కోసం బీజేపీ చూస్తోంది. షరతులు లేని మద్దతుకు ఎన్సీపీ సిద్ధమైనప్పటికీ కమలం దళం ఆ పార్టీతో పొత్తుకు సిద్ధంగా లేదు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఎన్సీపీతో పొత్తు పెట్టుకోమని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు.

శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే మెలిక నేపథ్యంలో బీజేపీ - శివసేనలు కలిసి ఏ మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనేది ప్రశ్నార్థకమే. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిలో ఉందామని థాకరే బీజేపీకి చెప్పారు. కానీ, ఎన్సీపీ షరతులు లేని మద్దతుకు సిద్ధపడింది. అయితే, బీజేపీ అగ్రనేత అద్వానీ సహా పలువురు బీజేపీ నేతలు శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే బాగుంటుందని భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో 13 స్థానాల్లో గెలిచిన రాజ్ థాకరే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్ ఈసారి ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది.. నాసిక్, ముంబై, విదర్భ తదితర ఎన్నో ప్రాంతాల్లో బీజేపీ సత్తా చాటింది. కాగా, ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి పైన మల్లగుల్లాలు పడుతోంది. సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై సీఎం అభ్యర్థిపై చర్చించింది. సీఎం అభ్యర్థి ఎన్నిక కోసం కమిటీ వేశారు. సీఎం రేసులో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్ నాథ్ ఖడ్సే, వినోద్ తవడే తదితరులు ఉన్నారు. కాగా, బీజేపీ, శివసేన మధ్య మైత్రికి ఎక్కువ అవకాశాలున్నాయి.

కాగా, మహారాష్ట్రలో బీజేపీ 122, శివసేన 63, కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41, ఎమ్మెన్నెస్ 1, మజ్లిస్ 2 స్థానాల్లో గెలుపొందింది. హర్యానాలో బీజేపీ 47, కాంగ్రెస్ 15, ఐఎన్ఎల్డీ 19 స్థానాల్లో గెలుపొందింది.

హర్యానా సీఎం రాజీనామా

శాసన సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు.

ఎవరేమన్నారు?

ఇది చారిత్రక విజయం. ఉన్నత శిఖరాలకు చేరుస్తాం - నరేంద్ర మోడీ

బీజేపీ, శివసేన పొత్తు కొనసాగాలి - అద్వానీ

మోడీ పాలన చూసి ఓటేశారు - అమిత్ షా

ప్రజా తీర్పును శిరసా వహిస్తాం - రాహుల్ గాంధీ

మోడీ నాయకత్వంలో ప్రజలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. అభివృద్ధి, సుస్థిరతకు ఓటేశారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు - వెంకయ్య నాయుడు

ప్రజల తీర్పు శిరసా వహిస్తాం - సోనియా గాంధీ

కాంగ్రెస్, ఎన్సీపీలపై అవిశ్రాంత పోరాటం చేశాం - ప్రకాశ్ జవదేకర్

బయటి నుండి బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధం - ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్.

రెండు రాష్ట్రాల ప్రజలు సరైన పార్టీని ఎన్నుకున్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం - శివరాజ్ సింహ్ చౌహాన్

చారిత్రాత్మక విజయం, మోడీ వల్లే గెలుపు - వసుంధరా రాజే

మహారాష్ట్ర ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు - దేవేంద్ర ఫడ్నవీస్

ఓటమికి పూర్తి బాధ్యత నాదే - కాంగ్రెస్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్

అభివృద్ధి చేసే పార్టీకి మద్దతు - ఉధ్ధవ్ థాకరే

ప్రజా నిర్ణయాన్ని శిరసా వహిస్తాం - భూపీందర్ సింహ్ హూడా

కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు - కిషన్ రెడ్డి

కాంగ్రెస్ ఓట్ల శాతం లోకసభ ఎన్నికల కంటే ఇప్పుడు పెరిగింది, మార్పు ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల కోసం సన్నద్ధమవుతాం - శశి థరూర్

మోడీ కాంగ్రెస్ రహిత భారత్ పిలుపుకు మార్గం ఏర్పడుతోంది. - యడ్యూరప్ప

మోడీ పైన ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఫలితాలు తెలియజేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. కాంగ్రెస్ పగ్గాలను వేరేవాళ్లకు అప్పగిస్తేనే భవిష్యత్తు - జేసీ దివాకర్ రెడ్డి

ప్రజా తీర్పును శిరసా వహిస్తామని, బీజేపీతో పొత్తు చర్చల పైన భేషజాలకు పోం - ఉద్ధవ్ థాకరే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+