Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద పండగ..!!

Maharashtra Jharkhand second phase Assembly Election Polling 2024:నవంబర్ 20వ తేదీన రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీకి 38 స్థానాలకు రెండో విడత పోలింగ్ జరుగుతుండగా.. మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో మొత్తం 288 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇక 18వ తేదీతో ప్రచార పర్వం ముగియగా .. ఇక బరిలో నిల్చున్న నేతలంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇటు జార్ఖండ్‌లో అటు మహారాష్ట్రలో పోరు హోరాహోరీ ఉండనుంది. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ మహా వికాస్ అగాఢీ మధ్య ప్రధాన పోరు జరుగుతుంది.

జార్ఖండ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. మరో గంటపాటు సమయం పొడిగించేందుకు ఈసీ అనుమతిచ్చింది. ఆ వెంటనే సాయంత్రం 6:30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ సందడి ఉంటుంది.జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

Maharashtra Jharkhand second phase Assembly Election Polling 2024 Live Updates key highlights in telugu

Nov 20, 2024, 6:43 pm IST

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముసిగింది. నాగపూర్‌లో పోలింగ్ బూత్‌లో EVM, VVPATలకు సీలు వేస్తున్న ఎన్నికల అధికారులు
Nov 20, 2024, 6:08 pm IST

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ముగిసిన పోలింగ్
Nov 20, 2024, 6:08 pm IST

సాయంత్రం 5 గంటల వరకు జార్ఖండ్‌లో 69.63%, మహారాష్ట్రలో 58.22% ఓటింగ్ నమోదైంది.
Nov 20, 2024, 6:06 pm IST

ముంబైలో ఓటు వేసిన నటుడు షారూఖ్ ఖాన్ , అతని భార్య గౌరీ ఖాన్, కుమార్తె & నటి సుహానా ఖాన్ , కుమారుడు ఆర్యన్ ఖాన్
Nov 20, 2024, 6:03 pm IST

ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత తన వేలికి ఉన్న సిరా గుర్తును చూపిస్తున్న రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక-ఛైర్‌పర్సన్ నీతా అంబానీ
Nov 20, 2024, 5:33 pm IST

జార్ఖండ్ ‌లో రెండో విడత పోలింగ్ ముగియడంలో ఈవీఎంలకు సీలు వేస్తున్న పోలింగ్ అధికారులు
Nov 20, 2024, 4:55 pm IST

ముంబైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న నటుడు సల్మాన్ ఖాన్
Nov 20, 2024, 4:45 pm IST

ముంబైలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన అనంతరం తమ వేళ్లకు ఉన్న సిరా గుర్తును చూపిస్తున్న నటి అనన్య పాండే, ఆమె తల్లి భావనా ​​పాండే, తండ్రి, నటుడు చుంకీ పాండే
Nov 20, 2024, 4:19 pm IST

నటి శ్రద్ధా కపూర్ తన తల్లి శివంగి కొల్హాపురే, అత్త & నటి పద్మిని కొల్హాపురే , సోదరుడు సిద్ధాంత్ కపూర్‌తో కలిసి ముంబైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Nov 20, 2024, 4:17 pm IST

జార్ఖండ్ ప్రజలు అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్నారు. మరోసారి జెఎంఎంకు పట్టం కట్టనున్నారని గాండే నియోజకవర్గ అభ్యర్థి , ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి, కల్పనా సోరెన్ అన్నారు.
Nov 20, 2024, 3:56 pm IST

మధ్యాహ్నం 3 గంటల వరకు, మహారాష్ట్రలో 45.53%, జార్ఖండ్‌లో 61.47% ఓటింగ్ నమోదైంది.
Nov 20, 2024, 3:52 pm IST

ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత తమ చేతి వేళ్లకు ఉన్న సిరా గుర్తును చూపిస్తున్నరిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన కుమారులు అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, కోడలు శ్లోకా మెహతా.
Nov 20, 2024, 3:28 pm IST

ముంబైలోని ఓటు వేసిన అనంతరం పోలింగ్ బూత్ నుండి బయటకు వస్తున్న నటులు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్
Nov 20, 2024, 3:10 pm IST

ముంబైలో ఓటు వేసిన అనంతరం నటుడు రణబీర్ కపూర్ మాట్లాడుతూ... ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత.. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Nov 20, 2024, 3:05 pm IST

ముంబైలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన నటి మాధురీ దీక్షిత్ .
Nov 20, 2024, 2:10 pm IST
మహారాష్ట్ర

‘వాతావరణం బాగుంది, ఓటు వేసేందుకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.. అందరూ ఓటు వేయాలి...’ అని సీఎం ఏక్‌నాథ్ షిండే కోడలు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే భార్య వృశాలి శ్రీకాంత్ షిండే అన్నారు.
Nov 20, 2024, 1:51 pm IST
ఉత్తర్ ప్రదేశ్

ఉపఎన్నిక

ముజఫర్‌నగర్ ఎస్‌ఎస్‌పి అభిషేక్ సింగ్ మాట్లాడుతూ "ముజఫర్‌నగర్‌లో, మీరాపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలకు శాంతియుతంగా పోలింగ్ జరుగుతోంది.హింసకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. మేము అప్రమత్తంగా ఉన్నాము. అన్ని రకాల ఫిర్యాదులు స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా స్వీకరిస్తున్నాం.
Nov 20, 2024, 1:31 pm IST
మహారాష్ట్ర

కూతురు ఇషా డియోల్‌తో కలిసి ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ప్రముఖ నటి, ఎంపీ హేమా మాలిని
Nov 20, 2024, 1:15 pm IST
మహారాష్ట్ర

ముంబైలో ఓటు వేసిన హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ ఆమె భర్త జాకీ భగ్నానీ
Nov 20, 2024, 1:02 pm IST

ఓటు వేసిన అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. ఈరోజు ప్రజాస్వామ్య పండుగ అని, ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు వేయాలని, ఇది మహారాష్ట్ర, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, 2019లో ఏం జరిగిందో ప్రజలు మరిచిపోలేదని అన్నారు.
Nov 20, 2024, 12:32 pm IST

ఉదయం 11 గంటల సమయానికి మహారాష్ట్రలో 18.1శాతం, జార్ఖండ్‌లో 31.3శాతం పోలింగ్ నమోదు
Nov 20, 2024, 12:06 pm IST

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 11 గంటలకు 18.14 శాతంగా నమోదైంది.
Nov 20, 2024, 11:59 am IST

బిజెపి నాయకుడు వినోద్ తావ్డే వచ్చిన డబ్బు పంపిణీ ఆరోపణలపై, శివసేన ఎంపి శ్రీకాంత్ షిండే ఖండించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు ఇలాంటి వివాదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బూటకపు కథనాల వల్ల ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉండదు, గత 2.5 ఏళ్లలో మహాయుతి చేసిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఓటేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Nov 20, 2024, 11:57 am IST

ముంబైలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన అనంతరం తన చేతి వేలికి ఉన్న సిరా గుర్తును చూపిస్తున్ననటుడు సునీల్ శెట్టి
Nov 20, 2024, 11:44 am IST

థానేలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఈరోజు ప్రజాస్వామ్య పండుగ, ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు వేయాలని కొరారు. ఇది మహారాష్ట్ర, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. 2019 లో ఏమి జరిగిందో ప్రజలు మరచిపోలేదని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మహాయుతి భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Nov 20, 2024, 11:40 am IST

ముంబైలో ఓటు వేసిన మహారాష్ట్ర మాజీ సిఎం, శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన భార్య రష్మీ థాకరే, వారి కుమారుడు , పార్టీ నాయకుడు ఆదిత్య ఠాక్రే .
Nov 20, 2024, 11:20 am IST

జల్గావ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే
Nov 20, 2024, 11:19 am IST

అకోలాలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన వంచిత్ బహుజన్ అఘాడి (VBA) అధ్యక్షుడు ప్రకాష్ అంబేద్కర్
Nov 20, 2024, 10:59 am IST
మహారాష్ట్ర

బీజేపీ నేత వినోద్ తావ్డేపై డబ్బు పంపిణీ ఆరోపణలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, "ఆ ప్రాంతంలో ఎలాంటి అభ్యర్థి ఉన్నాడో, అతని ట్రాక్ రికార్డ్ మరియు నేపథ్యం ఏమిటో మీ అందరికీ తెలుసు. ఈ తప్పుడు ఆరోపణలతో మేము ఆశ్చర్యపోలేదు. వినోద్. తావ్డే చాలా సీనియర్ నాయకుడు, ఇలాంటి ఆరోపణలను ఎవరూ నమ్మరు.
Nov 20, 2024, 10:44 am IST
మహారాష్ట్ర

నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గంలో తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్. భార్య అమృత ఫడ్నవిస్, తల్లి సరిత ఫడ్నవిస్‌తో కలిసి ఓటు వేశారు దేవేంద్ర ఫడ్నవిస్.
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+