బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటక సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత - 144 సెక్షన్: బోర్డర్ దాటితే.. అరెస్టులే

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక- మహారాష్ట్ర మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న వివాదం మరింత ముదిరింది. దాడుల వరకు వెళ్లింది. ఘర్షణలకు దారి తీసింది. దీనితో ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకున్నా దీనికి తెర పడట్లేదు. ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఈ ముఖ్యమంత్రులు ఎవరి పట్టుదలను వారు ప్రదర్శిస్తోన్నారు.

దశాబ్దాల కాలంగా..

దశాబ్దాల కాలంగా..

దశాబ్దాల కాలంగా కొనసాగుతూ వస్తోన్న సరిహద్దు వివాదం ఇది. 1957లో రాష్ట్రాల పునర్విభజన సమయంలో తలెత్తింది. ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. సరిహద్దులకు ఆనుకుని ఉండే బెళగావి కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. ఆ భూభాగం తమదంటే తమదంటూ పోటీ పడుతున్నాయి. అప్పట్లో మరాఠీ మాట్లాడే ప్రజలు పెద్ద ఎత్తున నివసించే ప్రాంతాలను కర్ణాటకలో విలీనం చేయడం దీనికి కేంద్రబిందువు.

సుప్రీంలో విచారణ..

సుప్రీంలో విచారణ..

కర్ణాటకలో ఉన్న బెళగావి, నిప్పాణి, కార్వార వంటి ప్రాంతాలతో పాటు 814 గ్రామాలు తమకు చెందుతాయని మహారాష్ట్ర వాదిస్తోంది. అప్పటి మహాజన్ కమిషన్ ఆధారంగా ఈ విభజన చోటు చేసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటీషన్లను దాఖలు చేశారు. దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది.

బెళగావిలో అసెంబ్లీ సమావేశాలు..

బెళగావిలో అసెంబ్లీ సమావేశాలు..

కాగా- ఇవ్వాళ్టి నుంచి బెళగావిలో కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్.. ఇతర నాయకులంతా బెళగావిలో మకాం వేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు అక్కడ మొదలు కావడం పట్ల జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భధ్రత చర్యలను తీసుకుంది.

మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి ఆందోళన..

మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి ఆందోళన..

అదే సమయంలో బెళగావిలో జిల్లాలోకి మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి నాయకులు ప్రవేశించడానికి ప్రయత్నించారు. బెళగావి ప్రాంతం తమదేనంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. బ్యానర్లను కట్టారు. వందలాది మంది మహారాష్ట్ర ఏకీకరణ సమితి నాయకులు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతినిధులు కర్ణాటక ప్రభుత్వానికి తమ డిమాండ్‌ను వినిపించడానికి ప్రదర్శనగా బయలుదేరి వచ్చారు. జై మహారాష్ట్ర అంటూ నినదించారు.

144 సెక్షన్..

ర్యాలీగా తరలివచ్చిన వారందరినీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. సరిహద్దుల్లో కొగ్నోళి టోల్ ప్లాజా సమీపంలో వారందరినీ నిలిపివేశారు. సరిహద్దులను దాటుకుని కర్ణాటకలోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు. వారంతా సరిహద్దులను దాటుకుని రావడానికి ప్రయత్నించడం, వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో బెళగావి జిల్లా పోలీసు యంత్రాంగం సరిహద్దులకు అదనపు బలగాలను తరలించింది. ముందు జాగ్రత్త చర్యగా 144

ఏముంది ఇండియాలో- కరప్షన్..పొల్యూషన్.. డర్టీ రోడ్స్: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలనంఏముంది ఇండియాలో- కరప్షన్..పొల్యూషన్.. డర్టీ రోడ్స్: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలనం

English summary
Maharashtra-Karnataka border row: Hundreds of Maharashtra Ekikaran Samithi workers attempting to enter Belagavi from Maharashtra stopped at border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X