భార్యకు ఓ భర్త ఊహించని షాక్ : కొడుకు శరీర భాగాలతో..
ఔరంగాబాద్ : భార్యతో గొడవ అనంతరం.. కుమారుడిని తీసుకుని బయటకెళ్లిపోయిన ఓ భర్త కొద్ది గంటల తర్వాత ఒక్కడే ఇంటికొచ్చాడు. దీంతో కొడుకు గురించి ఆరా తీసింది భార్య. ఆపై.. ఓ ప్లాస్టిక్ బ్యాగులో భర్త చూపించిన కొడుకు శరీర భాగాలు చూసి తీవ్ర షాక్ కు గురైంది. విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో పుష్ప-వాంకడే అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఓం అనే ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కాగా, గత సోమవారం రాత్రి భార్య భర్తలిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. దీంతో కొడుకుని తీసుకుని బయటకెళ్లిపోయాడు వాంకడే. అనంతరం ఒక్కడే ఇంటికి రావడంతో.. కొడుకు గురించి ఆరా తీసింది భార్య.

దీంతో మళ్లీ బయటకెళ్లి వచ్చిన వాంకడే.. కొడుకు శరీర భాగాలను ఓ ప్లాస్టిక్ బ్యాగులో పెట్టి తీసుకొచ్చాడు. ఔరంగాబాద్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిల్‌గాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. షాక్ తిన్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టిన పోలీసులకు పొంతన లేని సమాధానం చెప్పాడు వాంకడే.
భార్యతో గొడవ అనంతరం కొడుకును తీసుకుని రైల్వే స్టేషన్ వైపుగా వెళ్లానని, వద్దని చెప్పినా వినకుండా ఓం(బాలుడి పేరు) పట్టాల మీదకు వెళ్లడంతో.. అటుగా వచ్చిన ఓ రైలు ఓం ను ఢీ కొట్టిందని, దీంతో అక్కడిక్కడే చనిపోయాడని చెబుతున్నాడు వాంకడే. దీనిపై ఇంకా పోలీసు విచారణ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications