Maharashtra: ఏక్ నాథ్ దెబ్బతో సీఎం ఏక్ నిరంజన్, రెబల్ లీడర్ ఏక్ నాథ్ ఎవరు?, మాస్ లీడర్ !
ముంబాయి/ సూరత్/ న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఆ రాష్ట్ర రెబల్ మంత్రి, శివసేన సీనియర్ నాయకుడు ఏక్ నాథ్ షిండే ఎవరు ? అనే చర్చ జోరుగా జరుగుతోంది. గూగుల్ లో శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే ఎవరు ?, ఆయన నేపథ్యం ఏమిటి ? అని తెగ వెతికేస్తున్నారు. ఏ ముహూర్తానా మహారాష్ట్రలో 10 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు పెట్టారో కాని ఆ ముహూర్తం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పదవికే ఎసరు తెచ్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీకి చుక్కలు చూపించిన రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండే పలువురు శివసేన ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్ లోని సూరత్ చెక్కేశారు
. శివసేనాలో మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చకున్న ఏక్ నాథ్ షిండే ఠాక్రే కుటుంబానికి నమ్మినబంటుగా గుర్తింపు తెచ్చుకున్నారు. నమ్మిన బంటులా ఉన్న ఏక్ నాథ్ షిండే ఇప్పుడు ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసి ఏకంగా శివసేనలో చీలిక తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు ? అనే విషం అంతుచిక్కడం లేదు. మంత్రి ఏక్ నాథ్ కుమారుడు కూడా సిట్టింగ్ ఎంపీ కావడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. రెబల్ మంత్రి ఏక్ నాథ్ దెబ్బతో మహారాష్ట్ర సీఎం ఏక్ నిరంజన్ అయిపోయారు.

ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బతో ?
సోమవారం మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఊహించని విధంగా మెజారిటీ లేకపోయినా బీజేపీ నాయకులు ఐదో ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయింది. భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో సంకీర్ణ ప్రభుత్వంలోని ఆరవ అభ్యర్థి చంద్రకాంత్ (కాంగ్రెస్) ఓడిపోయారు.

ఎన్నికలకు పెట్టిన ముహూర్తం ఎఫెక్ట్
ఏ ముహూర్తానా మహారాష్ట్రలో 10 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు పెట్టారో కాని ఆ ముహూర్తం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పదవికే ఎసరు తెచ్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇంతకాలం శివసేనలో ఉన్న అసమ్మతి ఎమ్మెల్యేలు అందరూ ఏకమై మంత్రి ఏక్ నాథ్ షిండేకి జై కొట్టడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వెడెక్కిపోయాయి.

ఏక్ నాథ్ షిండే ఎవరు ?
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్న శివసేన పార్టీ సీనియర్ నాయకుడు ఏక్ నాథ్ షిండే పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఆ రాష్ట్ర రెబల్ మంత్రి, శివసేన సీనియర్ నాయకుడు ఏక్ నాథ్ షిండే ఎవరు ? అనే చర్చ జోరుగా జరుగుతోంది.

పక్కా మాస్ లీడర్
గూగుల్ లో శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే ఎవరు ?, ఆయన నేపథ్యం ఏమిటి ? అని తెగ వెతికేస్తున్నారు. శివసేనాలో మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చకున్న ఏక్ నాథ్ షిండే 2004, 2009, 2014, 2019లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శివసేన పార్టీలో మాస్ లీడర్ల జాబితాలో ఏక్ నాథ్ షిండే పేరు మొదటి వరుసలో ఉంది.

ఠాక్రే కుటుంబానికి నమ్మినబంటు
ఠాక్రే కుటుంబానికి నమ్మినబంటుగా గుర్తింపు తెచ్చుకున్నారు. నమ్మిన బంటులా ఉన్న ఏక్ నాథ్ షిండే ఇప్పుడు ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసి ఏకంగా శివసేనలో చీలిక తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు ? అనే విషం అంతుచిక్కడం లేదు. బాలాసాహెబ్ ఠాక్రే దగ్గర నుంచి ఉద్దవ్ ఠాక్రే వరకు శివసేన పార్టీ ఎక్కడ బహిరంగసభ పెట్టాలన్నా ఏక్ నాథ్ షిండే ముందు ఉండి ఆయన అధ్వర్యంలోనే నడిపించేవారు.

దెబ్బకు మైండ్ బ్లాక్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీకి చుక్కలు చూపించిన రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండే పలువురు శివసేన ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్ లోని సూరత్ చెక్కేశారు. సూరత్ హోటల్ లో బసచేసిన శివసేన పార్టీ రెబల్ మంత్రి ఏక్ నాథ్ తో మంతనాలు జరపాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏం డిసైడ్ చేస్తారో ?
రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే కల్యాణ్ లోక్ సభ నియోజక వర్గం నుంచి శివసేన పార్టీ టిక్కెట్ మీద పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు మొత్తం ఏక్ నాథ్ షిండే చుట్టూ తిరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం నిలబడాలన్నా, కుప్పకూలిపోవాలన్నా ఏక్ నాథ్ షిండే తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడింది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications