PM Modi: ప్రధాని మోదీ టార్గెట్ అదే, దాని ఫలితమే మహారాష్ట్రలో, వాళ్లకు దేశం మొత్తం కావాలి, చౌదరి !

ముంబాయి/న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల వేడి ఇప్పుడు దేశం మొత్తం వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో ఏం జరుగుతోంది, సంకీర్ణ ప్రభుత్వం పతనం అవుతుందా ?, బీజేపీ అధికారంలోకి వస్తుందా ?, రాష్ట్రపతి పాలన విధిస్తారా ?, లేక ఏం జరుగుతుంది ? అంటూ సామాన్య ప్రజలు ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుకుంటున్నారు.

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నాయకులను టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. మొదట బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ముక్త భారత్ అనే నినాదంతో మా పార్టీని సర్వనాశనం చెయ్యాలని ప్రయత్నాలు చేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అధీర్ రంజన్ చౌధరి సంచలన ఆరోపణలు చేశారు.

 Maharashtra political crisis: The BJPs aim is to build an opposition free India, says Congress leader Adhir Ranjan Chaudhary.

కొంతకాలం నుంచి కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో మొదలైన బీజేపీ నాయకుల అరాచకాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయని అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీల ముక్త భారత్ నినాదంతో ముందుకు వెలుతున్నారని, దాని ఫలితంగానే మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు బీజేపీకి మింగుడుపడటం లేదని, ప్రతిపక్షాలను మాట్లాడకుండా చెయ్యడమే ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. భారతదేశం మొత్తం స్వాధీనం చేసుకోవాలని బీజేపీ నాయకులు ప్రతయ్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అధీర్ రంజన్ చౌధరి సంచలన ఆరోపణలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+