వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకల్, నాన్ లోకల్ ట్యాగ్, ఆ రోజు తాత, ఇప్పుడు మనమడు, టార్గెట్ మోదీ, యోగి, ఠాక్రే రూటే సపరేటు !

|
Google Oneindia TeluguNews

లక్నో/ముంబాయి: బీజేపీతో మూడు సంవత్సరాల క్రితం వరకు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన శివసేన ఇప్పుడు పాత మిత్రపక్షాన్ని నువ్వానేనా అంటూ ఢీకొడుతోంది. మహారాష్ట్రకే పరిమితం అయిన శివసేన పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో శివసేన తన సత్తా చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ఎలాగైనా బోణి కొట్టి అక్కడి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు షాక్ ఇవ్వడానికి సిద్దం అయ్యింది. శివసేన వ్యవస్థాపకుడు బాలసాహెబ్ ఠాక్రే వారుసుడిగా రంగంలోకి దిగిన ఆదిత్య ఠాక్రే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో జోరుగా ప్రచారం చేస్తున్నాడు. లోకల్, నాన్ లోకల్ నినాదంతో బాల్ ఠాక్రే అప్పట్లో మహారాష్ట్రలో శివసేనను ఓ రైంజ్ లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు తాత బాల్ ఠాక్రే వారసత్వం అందిపుచ్చుకోవడానికి ఆయన మనుమడు, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మహారాఫ్ట్ర బయట కూడా బీజేపీని దెబ్బ కొట్టాలని శివసేన ప్రయత్నిస్తున్నది. బీజేపీ నాయకులు నిజమైన శ్రీరాముడి భక్తులు కాదని, వాళ్లు డ్రామాలు ఆడుతున్నారని, మేమే నిజమైన శ్రీరాముడి భక్తులు అని శివసేన జోరుగా ప్రాచారం చేస్తోంది.

Russia Ukraine War: కార్ల మీద చైనా జెండా ఉంటే సేఫ్, ఉక్రెయిన్ లో చైనీయులకు సలహా!Russia Ukraine War: కార్ల మీద చైనా జెండా ఉంటే సేఫ్, ఉక్రెయిన్ లో చైనీయులకు సలహా!

 ఉత్తరప్రదేశ్ లో ప్రాచారం చేస్తున్న ఆదిత్య ఠాక్రే

ఉత్తరప్రదేశ్ లో ప్రాచారం చేస్తున్న ఆదిత్య ఠాక్రే


ఉత్తరప్రదేశ్ లో మిగిలిన ఉన్న శాసన సభ నియోజక వర్గాల్లో తమ సత్తా చాటుకోవాలని ఆ రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ముంబాయి సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తున్నారు.

ఆదిత్య ఠాక్రే మార్క్ ప్రచారం

ఆదిత్య ఠాక్రే మార్క్ ప్రచారం


ఉత్తరప్రదేశ్ లోని సిద్దార్థ నగర్ జిల్లాలోని దోమరియాగంజ్ లో ఆదిత్య ఠాక్రే జోరుగా ప్రచారం చేశారు. తరువాత ప్రయోగరాజ్ లోని కొరాన్ నియోజక వర్గంలో ఆదిత్య ఠాక్రే ప్రచారం చేస్తారని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అంటున్నారు. మహారాష్ట్ర వెలుపల కూడా మేము 2024 నాటికి సత్తా చాటుకుంటామని శివసేన సీనియర్ నాయకుడు విశ్వజీత్ సింగ్ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు స్టేట్ మెంట ఇచ్చారు.

బీజేపీతో పోరాటం చేస్తున్న శివసేన

బీజేపీతో పోరాటం చేస్తున్న శివసేన

బీజేపీతో మూడు సంవత్సరాల క్రితం వరకు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన శివసేన ఇప్పుడు పాత మిత్రపక్షాన్ని నువ్వానేనా అంటూ ఢీకొడుతోంది. మహారాష్ట్రకే పరిమితం అయిన శివసేన పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.

 తాత వారసుడిగా మనుమడు

తాత వారసుడిగా మనుమడు


బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో శివసేన తన సత్తా చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ఎలాగైనా బోణి కొట్టి అక్కడి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు షాక్ ఇవ్వడానికి సిద్దం అయ్యింది. శివసేన వ్యవస్థాపకుడు బాలసాహెబ్ ఠాక్రే వారుసుడిగా రంగంలోకి దిగిన ఆదిత్య ఠాక్రే (31) ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో జోరుగా ప్రచారం చేస్తున్నాడు.

 ఆ రోజు లోకల్ నాన్ లోకల్...... ఇప్పుడు అదే మంత్రం

ఆ రోజు లోకల్ నాన్ లోకల్...... ఇప్పుడు అదే మంత్రం


లోకల్, నాన్ లోకల్ నినాదంతో బాల్ ఠాక్రే 1966లో మహారాష్ట్రలో శివసేనను ఓ రైంజ్ లోకి తీసుకెళ్లారు. దాదాపుగా 50 ఏళ్ల తరువాత ఇప్పుడు తాత బాల్ ఠాక్రే వారసత్వం అందిపుచ్చుకోవడానికి ఆయన మనుమడు, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తాత బాల్ ఠాక్రే అప్పుడు చేసిన మత్ర జపం ఇప్పుడు ఆయన మనుమడు ఆదిత్య ఠాక్రే చేస్తున్నారు.

Recommended Video

CM KCR - Prakash Raj Surprise Move దక్షిణాది రాష్ట్రాల్లో కీలకం | Third Front | Oneindia Telugu
 బీజేపీ నకిలి భక్తులు.... మేమే నిజమైన రాముడి భక్తులు

బీజేపీ నకిలి భక్తులు.... మేమే నిజమైన రాముడి భక్తులు

ఇప్పటికే బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మహారాఫ్ట్ర బయట కూడా బీజేపీని దెబ్బ కొట్టాలని శివసేన ప్రయత్నిస్తున్నది. బీజేపీ నాయకులు నిజమైన శ్రీరాముడి భక్తులు కాదని, వాళ్లు డ్రామాలు ఆడుతున్నారని, మేమే నిజమైన శ్రీరాముడి భక్తులు అని శివసేన జోరుగా ప్రాచారం చేస్తోంది.

English summary
This is the new avatar of the Shiv Sena, a party that is looking to grow beyond its regional tag and expand outside Maharashtra, and party leaders say, and 31-year-old Aaditya is the face of it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X