మహాత్మాగాంధీ ‘తెలివైన వ్యాపారి’ అన్న అమిత్ షా.. మండిపడిన కాంగ్రెస్
మహాత్మాగాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైశ్య కులాన్ని ఉద్దేశిస్తూ ఆయన తెలివైన వ్యాపారి (చతుర్ బనీయా) అని షా అభివర్ణించారు.
రాయ్‌పూర్: మహాత్మాగాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైశ్య కులాన్ని ఉద్దేశిస్తూ ఆయన తెలివైన వ్యాపారి (చతుర్ బనీయా) అని షా అభివర్ణించారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జాతిపితను, స్వాతంత్ర్య ఉద్యమాన్ని అవమానించడమేనని, ఇందుకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయగా.. షా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

రాయ్‌పూర్‌లో అమిత్ షా మాట్లాడుతూ ఎలాంటి సిద్ధాంత భూమిక లేకుండానే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైందని, దేశ స్వాతంత్ర్య సాధన కోసమే ఆ పార్టీని ఏర్పాటు చేశారని అన్నారు. అందుకే స్వాతంత్ర్యం రాగానే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని గాంధీ కోరుకున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్‌ను రద్దు చేసే పనిని నాడు గాంధీజీ చేయలేకపోయినా, నేడు కొందరు ఆ పనిని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గాంధీని సంకుచిత రీతిలో పోల్చడం ద్వారా ఆయనను అమిత్ షా అవమానించారని, షా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications