International Sex Workers Day: ఆ పోర్న్ స్టార్‌తో స్నేహం-నన్నూ సెక్స్ వర్కర్ అనుకున్నారు :నటి మహికా శర్మ
బాలీవుడ్ నటి,మోడల్ మహికా శర్మ బుధవారం(జూన్ 2) 'ఇంటర్నేషనల్ సెక్స్ వర్కర్స్ డే' సందర్భంగా సెక్స్ వర్కర్స్ పడుతున్న కష్టాలు,ఇబ్బందులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ పోర్న్ స్టార్‌తో స్నేహం చేసినందుకు తనపై కూడా సమాజం 'సెక్స్ వర్కర్' అన్న ముద్ర వేసిందని వాపోయారు. నిజానిజాలతో పని లేకుండా తనపై చేసిన ఆ దాడి నుంచి బయటపడేందుకు ఎన్నో సవాళ్లను,వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపింది. సెక్స్ వర్కర్స్ జీవితాల్లో ఎన్నో కష్టాలు ఉంటాయని చెబుతున్న మహికా... వారి కోసం తనవంతు కృషి చేస్తున్నారు.

పోర్న్ స్టార్ డానీతో స్నేహం చేసినందుకు....
'గతంలో నేను పోర్న్ స్టార్ డానీ డీతో స్నేహం చేసిన విషయం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అప్పటినుంచి అంతా నన్నూ సెక్స్ వర్కర్‌గా భావించడం మొదలుపెట్టారు. కేవలం డానీ డీకి స్నేహితురాలిని అయినందుకే సమాజం నాపై ఆ ముద్ర వేసింది.ఈ సమాజంలో ఒక అమ్మాయిని కించపరచడం చాలా సులువు. ఇవన్నీ ఎదుర్కోవడానికి శక్తినంత కూడదీసుకుని ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించాను. నాపైనే ఇలాంటి దాడి జరిగితే... ఇక సెక్స్ వర్కర్స్ జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో ఆలోచించాను. అందుకే సెక్స్ వర్కర్స్‌కి చేతనైన సాయంతో పాటు సమాజానికి వారి పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాను.' అని మహికా శర్మ వెల్లడించారు.

వ్యభిచార వృత్తి అంతం కావాలి... : మహికా
సెక్స్ వర్కర్లు ఆ వృత్తిని వదిలేసేలా చేయడంతో పాటు వారిని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందని మహికా పేర్కొన్నారు. సెక్స్ వర్కర్లు చాలా దోపిడీకి గురవుతారని... కొన్ని సందర్భాల్లో హింసకు కూడా గురవుతారని చెప్పారు. వారి వద్దకు వచ్చేవాళ్లు కొన్నిసార్లు వారిని తీవ్రంగా వేధిస్తారని చెప్పారు. 'వ్యభిచార వృత్తి అనేదే అంతం కావాలని నేను కోరుకుంటున్నాను. సెక్స్ వర్కర్లను ఆ వ్యభిచార కూపం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మనమంతా సహకరించాలి. ఇందుకు అవసరమైన అవగాహన కల్పించాలి.' అని మహికా చెప్పుకొచ్చారు.

పోర్న్‌పై నిషేధం విధించినా...
మన దేశంలో పోర్న్‌పై నిషేధం విధించినా... ఇప్పటికీ ఇంటర్నెట్‌లో అడల్ట్ సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయని మహికా పేర్కొన్నారు. లోకల్ ఆర్టిస్టులతో,వివిధ డిజిటల్ నెట్‌వర్క్‌లలో ఆ సినిమాలు విడుదలవుతున్నాయని చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఏదైనా చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహికా శర్మ 'రామాయణ','ఎఫ్ఐఆర్' వంటి టెలివిజన్ షోలతో పాటు 'మిస్టర్ జో బి. కర్వాలో' 'ఛలో ఢిల్లీ' వంటి హిందీ సినిమాల్లో నటించారు. గతంలో మహిళల నెలసరి గురించి మాట్లాడిన మహికా... నిజంగా స్త్రీలు అది గర్వించాల్సిన విషయం అన్నారు. అదొక సహజ ప్రక్రియ అని... దాన్ని మరోలా చూడాల్సిన అవసరం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications