ప్రధాని మోడీని హత్య చేస్తామని ఎన్ఐఏకు మెయిల్; అలెర్ట్ అయిన జాతీయ దర్యాప్తు సంస్థ
ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామంటూ దుండగుడు చేసిన ఒక మెయిల్ తో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏకంగా ప్రధాని మోడీని మట్టు పెడతామని, అందుకు ప్లాన్ ను కూడా సిద్ధం చేశామని ఎన్ఐఏ అధికారులకు పెట్టిన మెయిల్ ఇప్పుడు సంచలనంగా మారింది. శుక్రవారం రోజున ఈ ఘటన జరిగింది.

ప్రధాని మోడీని చంపేస్తామని మెయిల్, తన వద్ద 20 కిలోల ఆర్డీఎక్స్ ఉందన్న అగంతకుడు
ఎన్ఐఏ అధికారులకు గుర్తు తెలియని వ్యక్తి నుండి మెయిల్ వచ్చింది. ఈ మెయిల్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంపేస్తామంటూ పేర్కొన్నారు. అంతేకాదు మెయిల్ పంపిన వ్యక్తి తన వద్ద 20 కిలోల ఆర్‌డిఎక్స్ ఉందని దానిద్వారా వేలాది మందిని చంపగలనని కూడా వెల్లడించారు. తాను దేశవ్యాప్తంగా 20 దాడులకు ప్లాన్ చేస్తున్నాను అని మెయిల్ పంపిన దుండగుడు చెప్పారు. అంతేకాకుండా ఇరవై స్లీపర్ సెల్స్ ఆత్మాహుతి దాడికి సిద్ధంగా ఉన్నారని కూడా అందులో పేర్కొన్నారు.

దేశంలో పెను విషాదం సృష్టిస్తానన్న అగంతకుడు
దీంతో దుండగుడి వార్నింగ్ పై ముంబైలోని ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మెయిల్ ద్వారా ఆ వ్యక్తికి ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర అసంతృప్తి ఉందని అందుకే అతను అతను తన జీవితాన్ని పణంగా పెట్టినట్లు తెలిపారు. మెయిల్ పంపిన వ్యక్తి తాను ఈ పని చేయగల వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నానని వెల్లడించాడు. ఈ దేశానికి పెను విషాదాన్ని సృష్టిస్తానని వెల్లడించారు. తాను ఫిబ్రవరి 28న స్లీపర్ సెల్స్‌ని యాక్టివేట్ చేసాను అని మెయిల్ ద్వారా పేర్కొన్నాడు.

ముంబై బ్రాంచ్‌కు ఈ బెదిరింపు ఈ-మెయిల్.. కొనసాగుతున్న దర్యాప్తు
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), ముంబై బ్రాంచ్‌కు ఈ బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీకి హత్య చేస్తామని బెదిరిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ కు వచ్చిన మెయిల్ నేపథ్యంలో ఈ అంశంపై ఎన్‌ఐఏ విచారణ జరుపుతుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. మెయిల్ వచ్చిన మెయిల్ ఐడీపై విచారణ కొనసాగుతోంది. ఇది ఎవరైనా ఆకతాయి పెట్టిన మెయిల్ నా లేక మరేదైనా కారణం ఈ మెయిల్ వెనుక ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో మోడీని హత్యా చేస్తామంటూ లేఖ
ప్రధాని నరేంద్ర మోడీ చంపుతామని బెదిరిస్తూ ఎన్ఐఏకు మెయిల్ రావడం ఇదే మొదటిసారి కాదు. పూణే పోలీసులకు 2018 లో వచ్చిన ఒక లేఖలో రాజీవ్ గాంధీని హత్య చేసిన తరహాలోనే మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నామని పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా మరో మారు ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామని, దేశంలోనే అత్యంత పెను విషాదాన్ని సృష్టిస్తామని అగంతకుడు మెయిల్ చేశాడు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications