నటి మైత్రేయి నా భార్యే: దూరంగా ఉంటోందన్న డైరెక్టర్
హైదరాబాద్: కేంద్ర మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను వివాహం చేసుకుని ఇప్పుడు వేరే యువతితో పెళ్లికి సిద్దపడుతున్నారంటూ న్యాయస్దానం మెట్లెక్కిన నటి మైత్రేయి కేసు కొత్త మలుపు తిరిగింది.
మైత్రేయి తన భార్య అంటూ దర్శకుడు రిషి బెంగుళూరులోని మూడో ఏసీఎంఎం న్యాయస్దానంలో మంగళవారు ఫిర్యాదు చేశారు. "సూర్య ది గ్రేట్" సినిమా షూటింగ్ సమయంలో 2004లో ఆమెతో పరిచయమైందని, శేషాద్రిపురంలోని సన్మాన్ హోటల్‌లో ఆమెను 2008లో వివాహం చేసుకున్నానని... ప్రస్తుతం ఆమె తనకు దూరంగా ఉంటోందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడ పైన నటి మైత్రేయ కేసు పెట్టిన విషయం తెలిసిందే. మెడికల్ రిపోర్టులో ఆమె పైన ఎలాంటి అత్యాచారం జరగలేదని తేలినట్లుగా సమాచారం. బలవంతంగా అత్యాచారం చేసినట్లుగా నివేదికలో వెల్లడి కాలేదని ప్రచారం జరుగుతోంది.
అయితే, మైత్రేయ పరస్పర అవగాహనతో ఫిజికల్ రిలేషన్‌షిప్ కొనసాగించినట్లుగా వెల్లడయింట. కాగా, నటి మైత్రేయ ఎవరితో ఫిజికల్ రిలేషన్‌షిప్ కలిగి ఉందో తెలియరాలేదట. మైత్రేయ గత రెండు నెలలుగా ఫిజికల్ రిలేషన్‌షిప్ కలిగి ఉన్నట్లు వెల్లడియిందని తెలుస్తోంది.
మైత్రేయ పైన బలవంతంగా అత్యాచారం జరగలేదని డాక్టర్ అంబేడ్కర్ కాలేజ్ మెడికల్ వైద్యులు తేల్చినట్లుగా తెలుస్తోంది. ఈ నివేదికను వైద్యులు ఆర్టీ నగర్ పోలీసులకు అందచేశారు. మరోవైపు, కార్తీక్ గౌడను ప్రశ్నించేందుకు పోలీస్ టీం ఏర్పాటయింది. ఇదిలా ఉండగా.. కార్తీక్ గౌడ్ మరోసారి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
ప్రేమ-పెళ్లి-మోసం ఆరోపణల నేపథ్యంలో పరారీలో ఉన్న కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కార్తిక్ గౌడకు బెంగళూరు పోలీసులు సోమవారం అల్టిమేటం ఇచ్చారు. బుధవారంలోగా లొంగిపోకపోతే అరెస్టు తప్పదని తీవ్రంగా హెచ్చరించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications