పట్టాలు తప్పిన రైలు..అయిదు బోగీల్లో

Villupuram to Puducherry passenger train: తమిళనాడులో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ పాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అయిదు బోగీలు పట్టాలు తప్పాయి. భూమిలోకి కూరకుపోయియి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

విల్లుపురం నుంచి పుదుచ్చేరికి బయలుదేరి వెళ్లిన పాసింజర్ రైలు ఇది. విల్లుపురం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. రైల్వే స్టేషన్ సమీపంలోనే పట్టాలు తప్పింది. మొత్తం అయిది బోగీలు నేలలోకి దిగిపోయాయి. ఆ సమయంలో రైలు వేగం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.

Major accident was averted as 5 coaches of Villupuram to Puducherry passenger train was derailed

పట్టాలు తప్పడానికి ముందు భారీ శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఆ శబ్దం వినిపించిన వెంటనే లోకో పైలెట్లు రైలును తక్షణమే నిలిపివేశారు. సమాచారం అందిన వెంటనే రైల్వే భద్రత సిబ్బంది, అధికారులు, రైల్వే సాధారణ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

బోగీల్లో ఉన్న ప్రయాణికులందరినీ బయటికి తీసుకొచ్చారు. వారిని సురక్షితంగా రైల్వే స్టేషన్‌కు చేర్చారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం గానీ, గాయాలు గానీ కాలేదని విల్లుపురం రైల్వే స్టేషన్ అధికారులు వెల్లడించారు. ఇంజినీర్లు, ఇతర సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన పట్టాల పునరుద్ధరణ పనులు చేపట్టారు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు దక్షిణ రైల్వే అధికారులు తెలియజేశారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు మొదలుపెట్టినట్లు ప్రజా సంబంధాల అధికారి చెప్పారు. దీని వెనుక సాంకేతిక లోపం ఉందా? లేక విద్రోహ చర్య కారణమా? అనే విషయంపై విచారణ చేపట్టామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+