సోఫియాన్ కాల్పులు: ఆర్మీ మేజర్‌పై ఎఫ్ఐఆర్‌లో.. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం యూటర్న్!
న్యూఢిల్లీ: దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లా గవామ్‌పొరలో కాల్పుల ఘటనపై నమోదైన కేసులో ఆ రాష్ట్రప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో మేజర్ ఆదిత్య కుమార్ పేరును చేర్చలేదని సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
మేజర్ ఆదిత్య కుమార్ తండ్రి రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ కర్మవీర్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, దీనిపై ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీకోర్టు జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి సూచించింది. సుప్రీం ఆదేశాలతో కౌంటర్ దాఖలు చేసిన మొహబూబా ముఫ్తీ ప్రభుత్వం.. ఎఫ్ఐఆర్‌లో మేజర్ ఆదిత్య కుమార్ పేరును చేర్చలేదని బదులిచ్చింది.

అసలేం జరిగిందంటే...
గత జనవరిలో దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లా గవామ్‌పొరలో ఆర్మీ కాన్వాయ్‌పై కొందరు రాళ్లదాడికి పాల్పడటంతో సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో కేసు నమోదు చేసిన జమ్మూ కశ్మీర్ పోలీసులు, 10 గర్వాల్ రైఫిల్స్ విభాగంపై ఎఫ్ఆర్ దాఖలు చేశారు. ఇందులో 10 గర్వాల్ రైఫిల్స్ మేజర్ ఆదిత్య కుమార్ పేరును కూడా చేర్చారు.

సుప్రీంను ఆశ్రయించిన మేజర్ తండ్రి...
సాధారణ పౌరులపై ఆర్మీ కాల్పుల ఘటనలో తన కుమారుడు ఆదిత్య పేరును ఎఫ్‌ఐఆర్‌లో ఏకపక్షంగా చేర్చారని, అందులో నుంచి తొలగించాలని కోరుతూ ఆయన తండ్రి, రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ కర్మవీర్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సైన్యం తమ నిబంధనలను అతిక్రమించలేదని, ఆందోళనకారులు రొచ్చగొట్టెలా ప్రవర్తించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మ రక్షణ కోసమే కాల్పులు జరిపారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కౌంటర్ దాఖలు చేయమన్న సుప్రీం...
కర్మవీర్ సింగ్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీప్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల త్రిసభ్య ధర్మాసనం ఈ కాపీలను అటార్నరీ జనరల్ వేణుగోపాల్, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలకు అందజేయాలని సూచించింది.
ఆర్మీ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాన్ని గత నెలలో ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలుచేయాలని సూచించింది.

మేజర్ ఆదిత్య తండ్రి వాదన ఇదీ...
ఆర్మీ కాన్వాయ్‌పై ఆకతాయి మూకలు రాళ్లతో దాడి చేసి వికృత చర్యలకు పాల్పడ్డాయని, అయితే ఆ సమయంలో 10 గర్వాల్ రైఫిల్స్ మేజర్ ఆదిత్య కుమార్ ఘటనా స్థలానికి చాలా దూరంలో ఉన్నారని ఆయన తండ్రి కర్మవీర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న
అల్లరి మూకలను చెదరగొట్టి ప్రజా ఆస్తులను కాపాడటానికి ఓ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ హెచ్చరికగా కాల్పులు జరపడం... అనుకోకుండా ఆ బుల్లెట్లు తగలడంతోనే వారు చనిపోయారని పేర్కొన్నారు.

సుప్రీకోర్టుకు తెలిపిన కశ్మీర్ ప్రభుత్వం...
గవామ్‌పొర ఎన్‌కౌంటర్‌కు బాధ్యలును చేస్తూ మేజర్ ఆదిత్య కుమార్‌తోపోటు మరి కొందరు జవాన్లుపై సెక్షన్ 302, 307 కింద జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం హత్య, హత్యాయత్నం కేసులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సుప్రీం ఆదేశాలతో కౌంటర్ దాఖలు చేసిన మొహబూబా ముఫ్తీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఈ కేసులోని ఎఫ్ఐఆర్‌లో మేజర్ ఆదిత్య కుమార్ పేరును చేర్చలేదని తజాగా సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసులో పిటిషనర్ అయిన ఆదిత్య తండ్రి.. విధి నిర్వహణలో ఉన్న సైనికులపై నేరారోపణలు, వేధింపులు తగ్గాలంటే సైనికుల హక్కులను కాపాడటానికి, తగిన నష్టపరిహారం కోసం మార్గదర్శకాలను రూపొందించాలని కూడా సుప్రీంను కోరారు.












Click it and Unblock the Notifications