ముంబై అగ్నిప్రమాదం: ఏడుగురు దుర్మరణం
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ భారీ భవనంలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబైలోని దక్షిణ ప్రాంతంలో గల కెంప్స్ కార్నర్‌లోని బహుళ అంతస్థుల భవనంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో భవనంలో నివాసం ఉంటున్న ఏడుగురు మరణించారు.
26 అంతస్థులు గల మోంట బ్లాంక్ బిల్డింగ్‌లోని 12వ అంతస్థులో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సహాయక చర్యలు చేపడుతుండగా ఇద్దరు అధికారులతో పాటు ఐదుగురు ఫైర్ ఫైటర్స్ గాయపడ్డారు. భవనంలో నివాసం ఉంటున్న ఐదుగురు మరమించినట్లు ఓ అధికారి పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు.

మృతుల శవాలను జస్లోక్, బ్రీచ్ కాండీ, జెజె ఆస్పత్రి, నాయర్ ఆస్పత్రుకు పంపించారు. వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. సిలిండర్లు పేలినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలోనే ఐదుగురు ఫైర్ ఫైటర్స్ గాయపడినట్లు చెబుతున్నారు.
14 పైర్ ఇంజన్లు, ఏడు వాటర్ ట్యాంకర్లు, నాలుగు అంబులెన్స్‌లు రంగంలోకి దిగాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మంటలను ఆర్పినట్లు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications