పార్లమెంట్ పరిసరాల్లో భారీ అగ్నిప్రమాదం, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ల లైవ్ కవరేజీ వద్దు
న్యూఢిల్లీ: పార్లమెంట్ పరిసరాల్లో ఆదివారం మధ్యాహ్నాం అగ్ని ప్రమాదం సంభవించింది. రైల్ భవన్, ఏసీ ప్లాంట్ పవర్ హౌస్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఏడు పైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ల లైవ్ కవరేజీ వద్దు: కేంద్రం
ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను ప్రత్యక్ష ప్రసారం చేయరాదని టీవీ ఛానళ్లకు కేంద్రం స్పష్టం చేసింది. సాయుధ బలగాలు టెర్రరిస్టులను మట్టుబెట్టే క్రమంలో లైవ్ కవరేజి ఇస్తే, అది ఆపరేషన్ కు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని కేంద్రం పేర్కొంది.

మార్చి 20న జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో టెర్రిస్టులతో జరిగిన భారత ఆర్మీ పోరుని లైవ్‌గా టెలికాస్ట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే, కేంద్ర సమాచార, ప్రసార శాఖ తాజా నిర్ణయం తీసుకుంది.
దాడి జరుగుతున్న ప్రదేశం, బలాబలాలు, కదలికలు, వ్యూహాలు తదితర అంశాలను ప్రత్యేకంగా లైవ్ టెలికాస్ట్‌గా చూపొద్దని పేర్కొంది. నిర్ధిష్ట అధికారులే టెర్రర్ ఆపరేషన్ పూర్తైన తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి బిమల్ జుల్కా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications