భారీ విజయం: ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సైఫుల్లా హతం

శ్రీనగర్: ఉగ్రవాదులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూకాశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ హతమయ్యాడు. మరో ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు.

ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో.. జమ్మూ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సమయంలో హిజ్బుల్ కమాండర్ డాక్టర్ సైపుల్లా తోపాటు మరో ఉగ్రవాది పోలీసులపైకి కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి.

Major Success: Hizbul Mujahideen Chief Shot Dead In Srinagar

ఈ కాల్పుల్లో హిజ్బుల్ కమాండర్ సైఫుల్లా హతమయ్యాడు. మరో ఉగ్రవాదిని ప్రాణాలతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, మే నెలలో జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ కమాండర్‌గా ఉన్న రెయిజ్ నైకూ హతమయ్యాడు. అప్పట్నుంచి డాక్టర్ సైఫుల్లానే హిజ్బుల్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. అనేక దాడుల్లో ఉన్న సైఫుల్లా భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో సైఫుల్లా కూడా హతమయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+