ఢిల్లీ ఎర్రకోట కేసులో బిగ్ ట్విస్ట్..! 32 పేలుళ్ల కుట్ర-నిఘా వర్గాల షాకింగ్..!
ఢిల్లీ ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న పేలుళ్ల కేసు తవ్వే కొద్దీ షాకింగ్ వాస్తవాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించిన ఎన్ఐఏ బృందాలకు నిఘా వర్గాల నుంచి అందుతున్న విషయాలు విభ్రాంతి కలిగించేలా ఉన్నాయి. వీటిలో ఢిల్లీ ఎర్రకోట వద్ద ఒక్క కారు పేల్చి విధ్వంసం సృష్టించాలన్నది తీవ్రవాదుల ఆలోచన కాదని తేలింది. ఢిల్లీతో పాటు వివిధ నగరాల్లో 32 కార్లను పేల్చేందుకు వారు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు తీవ్రవాదులు హ్యుండాయ్ ఐ20 కారుతో పాటు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారు రూపురేఖలు మార్చి పేలుళ్లకు వాడేందుకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. ఈ రెండు కార్లను పేల్చిన తర్వాత మొత్తం 32 కార్లను వివిధ నగరాల్లో పేల్చడం ద్వారా భారీ విధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఎనిమిది మంది అనుమానితులు పేలుడు సామాగ్రిని గ్రూపులుగా విడిపోయి ఆయా నగరాలకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వివిధ నగరాల్లో ఐఈడీలను అమర్చి ఈ పేలుళ్లు ఏకకాలంలో జరపాలని వీరు ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఈ ప్లాన్ చేసిన వారిలో ఇప్పటికే అరెస్టు చేసిన డాక్టర్లు ముజమ్మిల్, అదీల్, ఉమర్, షహీన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ ఆపరేషన్ కోసం 20 లక్షల రూపాయలు పోగు చేసి డాక్టర్ ఉమర్ కు వీరు అందించినట్లు గుర్తించారు. ఈ మొత్తంతో 20 క్వింటాళ్ల నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం తో కూడిన ఎన్పీకే ఎరువు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేశారు. ఇందులో 3 లక్షలు గురుగ్రామ్ ప్రాంతం నుంచే సేకరించినట్లు గుర్తించారు. ఇందుకోసం ప్రధాన నిందితుడు ఉమర్ రహస్యంగా ఉండేలా ప్రైవేట్ సిగ్నల్ గ్రూప్ క్రియేట్ చేశాడు.ఇందులో మరో నలుగురిని సభ్యులుగా యాడ్ చేశాడు.

అలాగే ముజమ్మిల్ గతంలో ఐసిస్ కు అనుబంధంగా ఉన్న అన్సర్ గజ్వతుల్ హింద్ అనే సంస్థకు 2021 నుంచి 2022 వరకూ పనిచేశాడు. అతను ఈ తీవ్రవాద సంస్థకు ఇర్ఫాన్ అనే మరో వ్యక్తి ద్వారా పరిచయం అయినట్లు తేలింది. వీరంతా స్వతంత్ర తీవ్రవాద సంస్థ ఏర్పాటు చేసేందుకు 2023-24 మధ్య చేసిన ప్రయత్నాల్లో ఆయుధాలు పోలీసులకు లభ్యమయ్యాయి. దీంతో వీరి నెట్ వర్క్ మొత్తాన్ని ఛేదించేందుకు పోలీసులు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు.ఢిల్లీ పేలుడు తర్వాత నిందితుడు ఉమర్ వాడిన ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారును పోలీసులు ఖండవాలీ గ్రామంలో స్వాధీనం చేసుకున్నారు. ఇతను పేలుళ్లలో చనిపోయాడు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications