షాకింగ్: భార్యలకు డ్రగ్స్ అలవాటు చేస్తోంది భర్తలే
ఈటానగర్: ఈశాన్య రాష్ట్రాల్లో ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది! అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భర్తలే భార్యలకు మద్యం డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని సర్వేలో తేలింది. భార్యాభర్తలు ఇద్దరు కలిసిమెలిసి దానిని నంజుకుంటారట. నల్ల మందును భర్తలే అలవాటు చేస్తున్నారని ఇంటింటి సమగ్ర సర్వేలో వెల్లడైంది.
ఈశాన్య రాష్ట్రాల్లో 2.1 శాతం మంది మహిళలు నల్లమందు సేవిస్తున్నారు. వీరిలో ఎక్కువ మందికి భర్తలే ఈ అలవాటును చేస్తున్నారు. ప్రతి వందమందిలో 6.4 శాతం మంది కనీసం ఒక్కసారైనా నల్లమందును తీసుకుంటున్నారు.

మత్తుపదార్థాల సేవనలో మణిపూర్ 28.2 శాతం, మిజోరాం 17.4 శాతం, నాగాలాండ్ 14.9 శాతం, మేఘాలయ 12.1 శాతం, అసోం 10.2 శాతం, సిక్కిం 9.8 శాతం ఉంది. దీనిపై ఈశాన్య రాష్ట్ర మహిళల పైన సర్వే చేయడం ఇదే మొదటిసారి.












Click it and Unblock the Notifications