• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా విలయం: మోదీ వీరబాదుడు.. వాటిపైనా పన్నులు.. తలా రూ.7,500 ఇస్తేనే గట్టేక్కేది..

|
Google Oneindia TeluguNews

లాక్ డౌన్ ఉందికదాని సరుకుల రేట్లు పెంచి, ప్రజల నుంచి అడ్డగోలుగా డబ్బు గుంజితే చర్యలు తప్పవని వ్యాపార, వాణిజ్య సముదాయాలను ప్రభుత్వాలు హెచ్చరించాయి. కానీ ఎమర్జెన్సీ వేళలో పాలకులే వసూళ్లకు పాల్పడితే? కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. శానిటైజర్, మాస్క్‌లను తప్పనిసరి చేసిన సర్కారు.. వాటిపై పన్నులు మాత్రం పైసా తగ్గించలేదు. అంతేకాదు, కరోనా టెస్టింగ్ కిట్స్, ఆస్పత్రిలో బెడ్స్, ఆక్సిజన్ ఇతరత్రా సామాగ్రిని ధరల్ని ఇంచు కూడా సవరించలేదు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ మోదీ వీరబాదుడుపై కాంగ్రెస్ విస్మయం వ్యక్తం చేసింది.

దేనికి ఎంతంటే..

దేనికి ఎంతంటే..

కరోనా కాలంలో విరివిగా వాడుతోన్న శానిటైజర్‌పై అసలు ధరకు అదనంగా 18 శాతం జీఎస్టీ, లిక్విడ్ హ్యాండ్ వాష్ పై 18 శాతం, మాస్క్‌లపై 5 శాతం, ఆస్పత్రిలో బెడ్స్, టేబుల్స్ పై 18 శాతం, బ్లడ్ టెస్ట్ స్ట్రిప్పులపై 12 శాతం, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పై 12 శాతం జీఎస్టీని యధావిధిగా వసూలు చేస్తుండటాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ఇలాంటి కష్టకాలంలో ప్రజల్ని గుల్ల చేసే విధానాలు సరికావని, అది మానవత్వం అనిపించుకోదని హితవు పలికారు. కొవిడ్-19 వ్యాధికి సంబంధించిన అన్ని రకాల వైద్య సామాగ్రిపై వెంటనే జీఎస్టీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎవరేం చేస్తున్నారు..

ఎవరేం చేస్తున్నారు..

అధికార పార్టీ నేతల్లో అధిక శాతం మంది కరోనా వైరస్‌కు మతం రంగులు పులిమే పనిలో బిజీగా ఉండగా.. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలిచ్చే బాధ్యతను తాము మర్చిపోలేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. విదేశీ పెట్టుబడుల విషయంలో రాహుల్ గాంధీ సూచనను మోదీ సర్కార్ అమలు చేసిన దరిమిలా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో 11 మంది సభ్యుల హైలెవల్ కమిటీ.. లాక్ డౌన్ కష్టాల తొలగింపునకు ఓ పక్కా రూట్ మ్యాప్ తయారు చేస్తున్నది. ఈ కమిటీ సోమవారం ఢిల్లీలో భేటీ అయింది. అందులో చర్చించిన అంశాల్లో కీలకమైన పాయింట్లను డిమాండ్స్ రూపంలో ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. భేటీ వివరాలను జైరాం రమేశ్, రాహుల్ గాంధీలు వెల్లడించారు.

ప్రతి ఖాతాలో రూ.7500

ప్రతి ఖాతాలో రూ.7500

లాక్ డౌన్ కారణంగా అన్నీ కోల్పోయిన పేదలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.7500 జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ డబ్బులతో ప్రజలకు బతుకుపై భరోసా కల్పించినట్లవుతుందని, లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు కూడా దోహదపడుతుందని మన్మోహన్ కమిటీ అభిప్రాయపడినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తెలిపారు. అలాగే, వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద ఉపాధి క్షేత్రంగా ఉన్న ‘చిన్న, మధ్య తరహా పరిశ్రమల'రంగానికి కూడా వెంటనే ప్యాకేజీ ప్రకటించాలని కమిటీ సూచించినట్లు చెప్పారు. మన్మోహన్ కమిటీ సూచనల రిపోర్టును బుధవారం ప్రధాని మోదీకి అందజేస్తామని రమేశ్ పేర్కొన్నారు.

ముందే హెచ్చరించినా..

ముందే హెచ్చరించినా..

కరోనా మహమ్మారి భారత్ ను ముంచెత్తబోతోందని కాంగ్రెస్ పార్టీ ముందే హెచ్చరించినా మోదీ సర్కారు వినిపించుకోలేదని, మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని కూలగొట్టేపని కోసమే ఆలస్యంగా లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారని జైరాం రమేశ్ విమర్శించారు. కనీసం ఇప్పటికైనా ప్రధాని కళ్లు తెరిచి కాంగ్రెస్ సూచనలు స్వీకరిస్తుండటం మంచి పరిణామమని, లాక్ డౌన్ నేపథ్యంలో మన్మోహన్ కమిటీ ఇవ్వబోయే రిపోర్టు కచ్చితంగా ఈ దేశానికి మేలు చేకూర్చేలా ఉంటుందని ఆయన చెప్పారు.

రాహుల్ సూచనతో..

రాహుల్ సూచనతో..

కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. దీన్ని అనుకూలంగా మలుచుకుని విదేశీ సంస్థలు పెద్ద ఎత్తున భారత కంపెనీలను టేకోవర్ చేసే ప్రమాదం ఉందని, వెంటనే నిబంధనల్ని సవరించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచించారు. ఆలోపే.. ఇండియాలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లో.. చైనా సెంట్రల్ బ్యాంక్(పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా) తన వాటాను 1.01 శాతానికి పెంచుకుంది. మరికొన్ని కంపెనీలపైనా చైనా కన్నేసిందన్న సమాచారంతో మోదీ అలర్ట్ అయ్యారు. భారత్ ను ఆనుకుని ఉన్న పొరుగుదేశాల నుంచి వచ్చే ‘విదేశీ పెట్టుబడుల'పై తాత్కాలికంగా ఆంక్షలు విధించారు. ఈ చర్యను చైనా తప్పుపట్టింది. ఇకపోతే,

పెరిగిన కేసులు..

పెరిగిన కేసులు..


దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1553 కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసుల సంఖ్య 17,265కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. అందులో 2,851 మందికి వ్యాధి నయంకాగా, మరణాలు 559కి పెరిగాయన్నారు. తొలి దశలో కేసులు నమోదైన 59 జిల్లాల్లో గత 14 రోజులుగా ఎలాంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదని తెలిపారు.

English summary
After getting the government ring-fence Indian corporates from takeovers, Congress on Monday stepped up pressure on the Centre on seeking a waiver from GST on essential products in the fight against COVID-19 and Cash transfers for poor
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X