వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళకు ఎసరు: జయ వేదనిలయంపై కొత్త డిమాండ్

|
Google Oneindia TeluguNews

చెన్నై: పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసం వేద నిలయంపై కొత్త వాదన ముందుకు వచ్చింది. ఆ ఇల్లు జయలలిత ప్రియసఖి శశికళకు చెందుతుందని భావిస్తుండగా, ఆమెకు ఎసరు పెట్టే వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కె. షణ్ముగం అనే వ్యక్తి చేసిన విజ్ఞప్తి ఆ విషయాన్ని తెలియజేస్తోంది.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం ఉన్న పోస్ గార్డెన్‌‌లోని ఇంటిని ఆమె స్మారకంగా ప్రకటించాలని కె. షణ్ముగం ప్రభుత్వాన్ని కోరాడు. ఈ మేరకు ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు.

పోస్ గార్డెన్‌‌లోని వేద నిలయానికి సంబంధించి ఇప్పటికే అనేక పుకార్లు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆయన అన్నారు. పోయెస్ గార్డెన్‌ ఇంటిని శశికళ సొంతం చేసుకుంటారనే వార్తలొస్తున్న నేపథ్యంలో తాను ఈ అభ్యర్థనను వ్యక్తం చేసినట్లు కూడా ఆయన తెలిపారు.

Make Poes Garden residence a Jayalalithaa memorial, demands petition

ఇప్పటికే తన ప్రతిపాదనను ఆమోదిస్తూ 13వేల మందికి పైగా సంతకాలు చేశారని ఆయన తెలిపారు. సీఎం పన్నీరు సెల్వం తమ ప్రతిపాదనను మన్నించి ఆ ఇంటిని జయ స్మారకార్థంగా మార్చాలని కోరారు.

రామప్పురంలో ఉన్న ఎంజీ రామచంద్రన్ ఇంటిపై నెలకొన్న వివాదాన్ని ఆయన గుర్తు చేశారు. జయలలిత ఇంటికి కూడా ఆ పరిస్థితి రాకూడదనేఉద్దేశంతోనే తాను ఈ పిటిషన్ ద్వారా అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు.

English summary
Days after Tamil Nadu Chief Minister Jayalalithaa passed away from a cardiac arrest, a change.org petition has called for her Poes Garden residence in Chennai to be converted into a memorial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X