టిక్ టాక్ వీడియోలపై నిషేధం.. మొబైల్ ఫోన్లనూ బ్యాన్ చేస్తాం: స్వర్ణదేవాలయం కమిటీ సీరియస్
పంజాబ్ లోని సిక్కుల పవిత్రక్షేత్రం స్వర్ణదేవాలయం. అమృత్‌సర్ నగరంలోని ఈ ఆథ్యాత్మిక కేంద్రానికి రోజూ మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు వస్తుంటారు. పంగులు, ప్రత్యేక రోజుల్లో ఈ సంఖ్య పది లక్షలకు చేరువవుతుంది. కాగా, స్వర్ణదేవాలయంలోని ఆథ్యాత్మిక వాతావరణాన్ని చెడగొడుతూ కొంతమంది టిక్ టాక్ వీడియోలు చేస్తుండటం, అవికాస్తా వైరల్ కావడంతో ఈ వ్యవహారాన్ని ఆలయ నిర్వాహకులు సీరియస్ గా తీసుకున్నారు.

అందుకే బ్యాన్..
గోల్డెన్ టెంపుల్ ప్రాంగణంలో అభ్యంతరకర ప్రవర్తనను సహించబోమని, టిక్ టాక్ వీడియోలు చేయడాన్ని నిషేధిస్తున్నామని ఆలయ నిర్వాహకులైన శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్ జీపీసీ) తెలిపింది. భక్తుల రూపంలో ఆలయంలోకి వచ్చే కొంతమంది.. సిబ్బందిని బెదిరించిమరీ టిక్ టాక్ వీడియోలు చేస్తూ వాతావరణాన్ని పాడుచేస్తున్నారని, పలుమార్లు హెచ్చరించినా ఫలితం రానందువల్లే టిక్ టాక్ వీడియోలపై నిషేధం విధించామని అఖల్ తఖ్త్ జాతేదార్ హర్ ప్రీత్ సింగ్ తెలిపారు.

మొబైల్ ఫోన్లపైనా..
టిక్ టాక్ పై పర్బంధక్ కమిటీ ఆదేశాల తర్వాత కూడా ఎవరైనా వీడియోలు చేస్తే తీవ్ర చర్యల దిశగా వెళతామని, అవసరమనుకుంటే స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో మొబైల్ ఫోన్లపైనా నిషేధం విధించేందుకు వెనుకాడబోమని నిర్వాహకులు హెచ్చరిస్తున్నారు. ‘‘మొబైల్ ఫోన్లు నిషేధించడం మాకు నిజంగా ఇష్టం లేదు. కానీ ఆథ్యాత్మికత ప్రశ్నార్థకమయ్యే సమయంలో తప్పనిసరైతే ఆ నిర్ణయాన్ని కూడా తీసుకుంటాం''అని హర్ ప్రీత్ సింగ్ చెప్పారు.

ఆ అమ్మాయిలను గుర్తించారు..
స్వర్ణదేవాలయంలో టిక్ టాక్ వీడియోల వ్యవహారంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈ మధ్యే ముగ్గురు అమ్మాయిలు ఆలయంలోపల పంజాబీ పాటకు డ్యాన్సులు చేస్తూ రూపొందించిన టిక్ టాక్ వీడియో వైరలైంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆ అమ్మాయిలను గుర్తించిన గురువులు.. ఇంటిపెద్దలను హెచ్చరించినట్లు తెలిసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications