భారతీయులకు ఫ్రీగా వీసా.. ఆన్ లైన్ లో రెండ్రోజుల్లోనే అనుమతి: మలేసియా కీలక నిర్ణయం
మలేసియాకు వచ్చే భారతీయులకు ఒక్క పైసా కూడా తీసుకోకుండానే వీసాలను మంజూరు చేయనున్నట్లు మలేసియా ప్రభుత్వం ప్రకటించింది.
న్యూఢిల్లీ: మలేసియాకు వచ్చే భారతీయులకు ఒక్క పైసా కూడా తీసుకోకుండానే వీసాలను మంజూరు చేయనున్నట్లు మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ ఇటీవలే భారత్ లో పర్యటించారు.
ఇప్పటి వరకు ఏ మలేసియా ప్రధానీ భారత్ లో పర్యటించలేదు. దీంతో భారత్ లో పర్యటించిన తొలి మలేసియా ప్రధానిగా నజీబ్ రజాక్ రికార్డు సృష్టించినట్లయింది. తన పర్యటనలో భాగంగా భారత్ తో ఏడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

భారత్, మలేసియా మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయని, భారతీయ భాషలను మాట్లాడేవారు మలేసియాలో ఎంతోమంది ఉన్నారని రజాక్ చెప్పారు. ఇక్కడి సంస్కృతి, ఆహారం మలేసియాలోని అన్ని ప్రాంతాల్లో మిళితమైందని తెలిపారు.
ఇక మీదట ఆన్ లైన్ ద్వారా భారతీయులు మలేసియా వీసా నిమిత్తం దరఖాస్తు చేసుకుంటే, 48 గంటల్లోనే అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు. తాను భారతీయ సినిమాలకు అభిమానిని పేర్కొన్నారు. భారత్ తో మరింత ద్వైపాక్షిక బంధాన్ని తాము కోరుకుంటున్నామని, విద్య, వైద్య, ఉగ్రవాద వ్యతిరేక, ఆహార భద్రత విభాగాల్లో భారత్ సహకారాన్ని కోరుతున్నామని వివరించారు.












Click it and Unblock the Notifications