పేలుళ్ల కేసులో 17 ఏళ్ల తరువాత తుది తీర్పు..
మాలేగావ్ పేలుళ్ల కేసులో 17 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. 2008లో జరిగిన ఈ దారుణ ఘటనలో ఆరుగురు మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు. తాజాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వీరిలో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ కూడా ఉన్నారు.
గురువారం ముంబైలో ఎన్ఐఏ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ ఏకే లాహోటి ఈ తీర్పు వెలువరించారు. అనుమానాల ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్లలేమని, నిందితులకు వ్యతిరేకంగా ఉన్న ఆరోపణలపై సహేతుకమైన సాక్ష్యాధారాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

మాలెగావ్ పేలుళ్ల ఘటన అత్యంత తీవ్రమైన అంశమని న్యాయమూర్తి పేర్కొన్నారు. నైతికత అనే ప్రాతిపదికన కోర్టు ఎవరినీ శిక్షించబోదని వ్యాఖ్యానించారు. హిందూత్వ తీవ్రవాదం అనే వివాదాస్పద పదజాలం పుట్టుకకు దారితీసిన ఈ కేసులో- తీవ్రవాదానికి మతం లేదు, కానీ శిక్ష నైతిక ప్రాతిపదికన ఉండకూడదని అని కోర్టు స్పష్టం చేసింది.
ప్రజ్ఞా ఠాకూర్, పురోహిత్‌తో పాటు రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ, సుధాకర్ చతుర్వేది, అజయ్ రహీర్కర్, సుధాకర్ ధర్ ద్వివేది అలియాస్ శంకరాచార్య, సమీర్ కుల్ కర్ణిలను కూడా కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. 2008 సెప్టెంబరు 29న మలేగావ్‌లో జరిగిన ఈ పేలుడులో ఎల్ఎంఎల్ ఫ్రీడమ్ బైక్‌కు అమర్చిన పేలుడు పరికరం పేలి ఆరుగురు మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు.
మొదట మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) దర్యాప్తు చేసిన ఈ కేసును 2011లో జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు. ముస్లింలు, హిందువుల మధ్య జరిగిన దాడులకు ప్రతీకారంగా అభినవ్ భారత్ గ్రూప్ ఈ పేలుళ్లకు కుట్ర పన్నిందని ఏటీఎస్ అప్పట్లో ఆరోపించింది.
పేలుళ్లకు ఉపయోగించిన బైక్ యజమాని ప్రజ్ఞా ఠాకూర్ అని, సైనిక ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ పేలుడు పదార్థాలను సమకూర్చడంలో సహాయం చేశారని పేర్కొంది. అభినవ్ భారత్‌తో సమావేశాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని, పేలుడు పదార్థాలను సమకూర్చారని తెలిపింది.
పురోహిత్ ఆర్డీఎస్ తెచ్చి బాంబును తయారు చేశారని నిరూపించడానికి రికార్డుల ప్రకారం ఎటువంటి సాక్ష్యం లేదని కోర్టు తెలిపింది. అలాగే- పేలుడుకు ఉపయోగించిన బైక్ యజమాని ప్రజ్ఞా ఠాకూర్ అని నిరూపించడానికి బలమైన ఆధారాలు లేవని న్యాయమూర్తి లాహోటి పేర్కొన్నారు.
ఫోరెన్సిక్ నిపుణులు ఛాసిస్ సీరియల్ నంబర్‌ను పూర్తిగా రికవరీ చేయలేకపోయారు. ఫలితంగా పేలుళ్లకు ఉపయోగించిన బైక్ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కే చెందిందని ప్రాసిక్యూషన్ నిరూపించడంలో విఫలమైంది కోర్టు తెలిపింది. అంతేకాకుండా- పేలుళ్లకు రెండేళ్ల ముందు ప్రజ్ఞా ఠాకూర్ సన్యాసం స్వీకరించారని గుర్తు చేసింది.
అభినవ్ భారత్ ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. మెటీరియల్ సాక్షులు ప్రాసిక్యూషన్ కేసును సమర్థించలేదని, కుట్రకు సంబంధించిన సమావేశాలు జరిగినట్లు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని తేల్చి చెప్పింది.
ప్రభుత్వ వాదన ప్రకారం 101 మంది గాయపడ్డారనే విషయాన్ని కోర్టు అంగీకరించలేదు. ఆరుగురు మరణించారని గుర్తించింది. మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications