బెంగళూరు సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అరెస్టు, 31 ఏళ్ల క్రితం నాటి కేసు ఎఫెక్ట్ !

అయోధ్య రామమందిరం పాత గొడవలకు సంబంధించి 31 ఏళ్ల తరువాత శ్రీకాంత్ పూజారి అనే వ్యక్తి అరెస్టు కావడం కలకలం రేపింది. శ్రీకాంత్ పూజారి అరెస్టును నిరసిస్తూ కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం కూడా బెంగళూరులోని మల్లేశ్వరం పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సురేష్ కుమార్ ధర్నా చేశారు.

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సురేష్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందువులను అరెస్టు చేసేందుకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, దీన్ని మేము సహించమని, మేము హిందువులం, మమ్మల్ని కూడా అరెస్ట్ చేయండి అంటూ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ తో పాటు బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ నిరసనకు దిగారు.

Malleswaram police arrested BJP Senior MLA Suresh Kumar in Bengaluru

నేను 1992 డిసెంబర్ 6వ తేదీన అయోధ్య శ్రీరామ మందిరానికి సేవకుడినని, నన్ను కూడా అరెస్ట్ చేయండి' అనే ప్లకార్డు పట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ బెంగళూరులోని మల్లేశ్వరం పోలీస్ స్టేషన్ ఆవరణంలోనే ధర్నాకు దిగారు. ఈ సమయంలో బీజేపీ కార్యకర్తలు బీజేపీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ కు మద్దతుగా నిలిచి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Malleswaram police arrested BJP Senior MLA Suresh Kumar in Bengaluru

మేము కూడా శ్రీరామ భక్తులమే. మమ్మల్ని కూడా అరెస్ట్ చేయండి అంటూ నినాదాలు చెయ్యడం మొదలుపెట్టారు. ఈ సమయంలో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చెయ్యడానికి ప్రయత్నించారు. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే బీజేపీ ఎమ్మెల్యే సురేష్‌ను మల్లేశ్వరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1992లో రామమందిరాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరిగిన అల్లర్ల కేసులో నిందితుడైన శ్రీకాంత్ పూజారిని ఇటీవల హుబ్బళి పోలీసులు అరెస్టు చేశారు.

Malleswaram police arrested BJP Senior MLA Suresh Kumar in Bengaluru
శ్రీకాంత్ పూజారి బెయిల్ కోసం హుబ్బళి కోర్టును ఆశ్రయించారు. శ్రీకాంత్ పూజారికి ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తే కోర్టుకు అతను దూరమయ్యే అవకాశం ఉందని ఆరోపిస్తూ శ్రీకాంత్‌పై హుబ్బళ్లిలోని వివిధ స్టేషన్లలో 13 క్రిమినల్ కేసులు, 3 ముందస్తు జాగ్రత్త కేసులు నమోదైనట్లు పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. హజరేసాబ్ మలిక్సాబ్ అంగడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్‌పై ఐపీసీ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 31 ఏళ్ల క్రితం నాటి పాత కేసులో ఇప్పుడు శ్రీకాంత్ పూజారిని అరెస్టు చెయ్యడం కర్ణాటక వ్యాప్తంగా కలకలం రేపింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+