కరోనా కలకలం.. వెంకయ్యనాయుడి వీడ్కోలు సభలో పాల్గొన్న మల్లికార్జున ఖర్గేకు పాజిటివ్
రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కు కొవిడ్ పాజిటివ్ గా తేలింది. మరోసాని కరోనా సోకిందని, తనను కలిసినవారంతా జాగ్రత్తలు పాటించాలని కోరారు. రెండురోజుల క్రితం ఖర్గే ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీతోపాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు ఎంపీలు పాల్గొన్నారు. ఇప్పుడు ఖర్గే ప్రకటనతో కలకలం రేకెత్తుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. రెండోసారి తనకు కొవిడ్ సోకిందని, ఐసొలేషన్‌లో ఉన్నానని, అన్ని నిబంధనలు పాటిస్తున్నట్లు ప్రియాంక ట్వీట్ చేశారు.
ఈనెల ఐదోతేదీన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ధరల పెరుగుదల, అగ్నిపథ్, నిత్యావసరాలపై జీఎస్టీ విధింపు లాంటివాటికి నిరసనగా ఈ కార్యక్రమాలు జరిగాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, ఖర్గే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తదితరులు పాల్గొన్నారు. తాజాగా రాజస్థాన్ లో పర్యటించాల్సిన రాహుల్ అనారోగ్యం కారణంగా తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Recommended Video

దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తోందని వైద్యవర్గాలు వెల్లడించాయి. పాజిటివిటీ రేటు 4.94గా ఉండగా, క్రియాశీల కేసులు 1.28 లక్షలకు చేరుకున్నాయి. ఢిల్లీలో మాత్రం రోజుకు రెండువేలకు పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేశవ్యాప్తంగా 207 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.












Click it and Unblock the Notifications