శవ రాజకీయం -మోదీ సంచలనం -టీఎంసీ తుక్కురేగింది -దీదీనే అడ్డుగోడ -మమత ఆడియో లీక్

కరోనా విలయంతో పోటీ పడుతూ పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంగ్రామం సాగుతున్నది. శనివారం ఐదో దశ పోలింగ్ జరగ్గా, మిగిలిన మూడు దశల ఎన్నికల కోసం భారీ ఎత్తున ప్రచారమూ కొనసాగింది. కోల్ కతా తర్వాత బెంగాల్ లో అతిపెద్ద నగరమైన అసన్‌సోల్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. కూచ్ బెహార్ లో నలుగురు పౌరుల్ని కేంద్ర బలగాలు కాల్చిచంపిన ఘటనను ప్రస్తావిస్తూ, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ శవ రాజకీయాలను అలవాటేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు, లీకైన ఆడియో క్లిప్పులపై సీఐడీతో దర్యాప్తు చేయిస్తామని సీఎం అన్నారు. వివకాల్లోకి వెళితే..

కక్ష సాధింపులకు హద్దు లేదా..

కక్ష సాధింపులకు హద్దు లేదా..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కక్ష సాధింపు రాజకీయాలు హద్దులు దాటాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. దీదీ రాజకీయాలు నిరసనల పరిధిదాటి కక్ష సాధింపులో ప్రమాదకర స్థాయినీ మించాయన్నారు. తొలి నాలుగు విడతల్లో జనం బీజేపీకి పట్టం కట్టారని, శనివారం నాటి ఐదో విడత పోలింగ్ లోనూ ఓటర్లు కమలం గుర్తుపైనే మీట నొక్కారని, మే 2 తర్వాత బెంగాల్ కు టీఎంసీ పీడ విరగడవుతుందన్నారు.

శవరాజకీయాలు అలవాటే..

శవరాజకీయాలు అలవాటే..


''ఇప్పటికే ముగిసిన నాలుగు దశల ఎన్నికల్లో టీఎంసీ తునాతునకలైపోయింది. ఐదో దశలోనూ కమలం వికసించింది. ఇక మిగిలిన మూడు దశల పోలింగ్‌లో దీదీ-భైపో (మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు) పూర్తిగా తుడిచిపెట్టుకుపోతారు. ఓటమి ఖరారైంది కాబట్టే, దీదీ తను బాగా అలవాటైన శవరాజకీయాలను చేస్తున్నారు. కూచ్ బెహార్ లో (సీఐఎస్ఎఫ్ కాల్పుల్లో) దురదృష్టవశాత్తూ చనిపోయిన వ్యక్తుల శవాలను అడ్డం పెట్టుకుని మమత చీప్ ట్రిక్స్ ప్లే చేద్దామనుకున్నారు. బెంగాల్ అభివృద్ధి బాటలో ఓ పెద్ద గోడ మాదిరిగా మమత బెనర్జీ అడ్డుగా నిల్చున్నారు. ఆ గోడను కూలగొట్టాలని జనం ఇప్పటికే తీర్పు చెప్పారు'' అని ప్రధాని మోదీ అన్నారు. కాగా,

మమత ఆడియో లీక్.. కలకలం

మమత ఆడియో లీక్.. కలకలం

ఎన్నికల వేళ టీఎంసీకి సంబంధించి మరో ఆడియో క్లిప్ లీకైంది. గత వారం స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిశోర్ టేపుల మాదిరే, ఈసారి సీఎం మమత బెనర్జీ, కూచ్ షీతల్ (కూచ్ బెహార్) జిల్లా టీఎంసీ అధ్యక్షుడు ప్రధాన్ ప్రతిమ్ రాయ్ మధ్య జరిగిన సభాషణ బహిర్గతమైంది. కూచ్ బెహార్ లో కేంద్ర బలగాల చేతిలో చనిపోయిన నలుగురు వ్యక్తుల మృతదేహాలతో ర్యాలీ చేపడదామంటూ మమత సూచనలివ్వడం ఆ ఆడియోలో వినిపించింది. కాగా, తన ఫోన్ ను బీజేపీ వాళ్లు ట్యాప్ చేస్తున్నారని సీఎం మమత ఎదురుదాడికి దిగారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఐడీతో దర్యాప్తు చేయిస్తానన్నారు. ఎన్నికల్లో జనమంతా టీఎంసీ వైపు ఉండటంతో బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని మమత మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+