బెంగాల్ లో అదే నిజం కానుందా - ఫలితాలపై మమత క్లియర్ సంకేతాలు..!?

పశ్చిమ బెంగాల్ లో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. రెండో విడతలో 142 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. రెండో విడతలో మొత్తం 1,448 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించు కుంటుండగా, 3కోట్ల21 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చుతున్నారు. తొలి విడత లో రికార్డు స్థాయిలో 92శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈ రెండో విడతలోనూ భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో బెంగాల్ ఫలితాల పైన బీజేపీ, టీఎంసీ నేతలు ఇస్తున్న సంకేతాలు రాజకీయంగా ఉత్కంఠను పెంచుతున్నాయి.

బెంగాల్ లో రెండో విడత పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 11 గంటలకు 39.97 శాతం పోలింగ్‌ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. అటు టీఎంసీ నేతలు బీజేపీకి సవాల్ చేస్తున్నారు. బీజేపీ గెలిచే అవకాశం లేదని.. మే 4న ఫలితాల్లో టీఎంసీ విజయం సాధిస్తే బీజేపీ నేతలు రాజీనామా కు సిద్దమా అంటూ ఛాలెంజ్ విసురుతున్నారు. ఇదే సమయంలో బంగాల్‌లో రెండో దశ పోలింగ్‌ సందర్బంగా కొన్ని చోట్ల జరిగిన ఉద్రిక్త ఘటనలపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈసీ అజర్వర్లు బీజేపీ ఆదేశాల మేరకు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు.

పొలిటికల్ బ్లాస్టింగ్, విజయ్ కొత్త చరిత్ర- బెంగాల్ లో నో కన్ఫ్యూజన్..!?
పొలిటికల్ బ్లాస్టింగ్, విజయ్ కొత్త చరిత్ర- బెంగాల్ లో నో కన్ఫ్యూజన్..!?
mamata-banerjee-alleged-rigging-during-the-ongoing-second-phase-of-voting-in-west-bengal-assembly

రెండో విడతలోనూ భారీ పోలింగ్

ఇప్పటికే మమతా ప్రజలకు ఇచ్చిన సందేశంలో ఎన్నికల్లో 'మా-మాటి-మానుష్' (తల్లి, నేల, ప్రజలు) విజయం ఖాయమని పేర్కొన్నారు. బెంగాల్ సంస్కృతి, వారసత్వాన్ని రక్షించుకోవాలని, విభజన శక్తులను తిప్పికొట్టాలని ఓటర్లను కోరారు. ఐకమత్యం, సంస్కృతి, నాగరికత బెంగాల్‌కు గర్వకారణమని, బెంగాల్ వారసత్వాన్ని దిగజార్చాలనుకునే విభజన, విధ్వంసకర శక్తులకు రాష్ట్రంలో చోటులేదని పరోక్షంగా బీజేపీని ప్రస్తావిస్తూ మమత బెనర్జీ ఘాటుగా విమర్శించారు.

బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. తొలి విడత పోలింగ్ జరిగిన 152 నియోజకవర్గాల్లో 110 స్థానాలను తాము గెలుచుకోనున్నామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. బీజేపీ వాదనను టీఎంసీ తోసిపుచ్చింది. వరుసగా నాలుగోసారి టీఎంసీ అధికారంలోకి రానుందని చెప్పింది. మే 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్న వేళ.. తుది ఫలితాల పైన ఉత్కంఠ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+