వారిని అరెస్ట్ చేసి షాకిచ్చిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అభ్యంతరకరమైన మీమ్స్ పోస్టు చేసిన ఏడుగురు యూట్యూబర్లపై కోల్‌కతా పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో ఒకరిని అరెస్ట్ చేయగా, ఇతరుల అరెస్ట్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ చేసిన ప్రసంగాల ఆధారంగా అభ్యంతరకరమైన మీమ్స్‌ను వీరు పోస్ట్ చేశారు.
దీనిపై సాగర్ దాస్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా టోటల్ ఫన్ బంగ్లా, రియా ప్రియా, టిక్‌టాకర్ ప్రచితా, సాగరికా బర్మన్ వ్లాగ్స్, లైఫ్ లైన్ ఇన్ దుర్గాపూర్, ఫ్రెండ్స్ క్యాంపస్, పూజాదాస్ 98 వంటి పేర్లను సాగర్ దాస్ ప్రస్తావించాడు.

మమతా బెనర్జీ ప్రసంగం నుంచి తీసుకున్న కొన్ని భాగాలను మీమ్స్‌లో వాడారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. వీటి కారణంగా ఘర్షణలు చెలరేగి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉందని, నిందితులు వ్యక్తిగత సంపాదన కోసమే వీటిని మీమ్స్‌ను తయారు చేశారన్నారు. కేసును రిజిస్టర్ చేసిన పోలీసులు ఇందులో ప్రత్యర్థిగా ఉన్న రాజకీయ పార్టీల సహకారం ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
బెంగాల్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ ని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలను ఉపయోగిస్తూ అవినీతికి పాల్పడుతున్న తృణమూల్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఒక మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులను తమ అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ, ఈడీలకు వ్యతిరేకంగా బెంగాల్ అసెంబ్లీలో తీర్మానం చేశారు












Click it and Unblock the Notifications