"సీక్రెట్ ఓటింగ్ జరిపితేనే.. మోడీ బండారం బయటపడుతుంది"
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై పోరుబాట పట్టిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులే గాక బీజేపీ నేతలు సైతం మోడీ నిర్ణయంపై సుముఖంగా లేరని చెప్పిన ఆమె.. దీనిపై సీక్రెట్ ఓటింగ్ జరిపితేనే మోడీ బండారం బయటపడుతుందని వ్యాఖ్యానించారు.

కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలిసి గురువారం నాడు ఆజాద్ పూర్ లో ర్యాలీ చేపట్టారు మమతా. పరిస్థితి తీవ్రత గురించి వివరిస్తూ.. గతంలో ఎమర్జెన్సీ సమయంలోను దేశంలో ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని అన్నారు. అచ్చేదిన్ అంటే ఇదేనా అంటూ మోడీ ప్రశ్నించిన మమతా.. ప్రస్తుతం దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొందని పేర్కొన్నారు.
నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతుంది బడాబాబులు కాదని, కేవలం సామాన్యులు మాత్రమే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. 'పేదలు ఏం తినాలి.. దమ్ముంటే నల్లకుబేరులను జైల్లో పెట్టించండి' అంటూ ఫైర్ అయ్యారు మమతా.












Click it and Unblock the Notifications