ఆందోళన విరమించని వైద్యులు .. డ్యూటీ డాక్టర్‌ను కలిసేందుకు మమత నో

వడోదర : బెంగాల్‌లో వైద్యుల ఆందోళన కొనసాగుతుంది. తనపై దాడులను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. వైద్యులు విధులకెళ్తే రోగి బంధువుల దాడిలో గాయపడ్డ వైద్యుడిని పరామర్శిస్తానని బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రకటించారు. అయితే వైద్యులు విధులకు వెళ్లబోమని భీష్మించుకొని కూర్చొవడంతో తన పరామర్శ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు మమత.

రోగి బంధువుల దాడి ..
గత సోమవారం ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో రోగి బంధువులు బీభత్సం సృష్టించి నంగతి తెలిసిందే. తమ బంధువు చనిపోవడానికి జూనియర్ డాక్టర్లు పరిబర ముఖపాధ్యాయ్, యాష్ కారణమని దాడిచేశారు. దాదాపు 200 మంది ఆస్పత్రిలో నానా హంగామా చేశారు. ముఖపాధ్యాయ తలపై వెనక నుంచి ఇటుకపెళ్లతో దాడిచేయడంతో పుర్రె ఎముక విరిగింది. దీంతో తొలుత ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. తర్వాత పార్క్ సైన్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులపై దాడిని నిరసిస్తూ ఎన్ఆర్ఎస్ డాక్టర్లు నిరసన చేపట్టారు. విధులకు హాజరుకాకపోవడంతో .. ప్రభుత్వం అల్టిమేటం కూడా జారీ చేసింది. అయినా ఎలాంటి మార్పురాకపోవడంతో ఏం చేయాలని మమత సర్కార్ యోచిస్తోంది.

Mamata Banerjee cancels meeting with injured doctor Paribaha Mukhopadhyay

మమత ఆదేశించినా ...
ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు మమత రంగంలోకి దిగారు. విధుల్లోకి చేరమని వైద్యులకు అల్టిమేటం జారీచేశారు. అయినా వైఖరిలో మార్పు రాకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. ఇంతలో బెంగాల్ హైకోర్టు కల్పించుకొని .. వైద్యులతో సంప్రదింపులు జరుపాలని సూచించినా సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్ఆర్ఎస్ వైద్యులకు దేశవ్యాప్తంగా వైద్యులు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే రెండురోజులు ఎయిమ్స్ వైద్యులు విధులను బహిష్కరించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా వైద్యుల ఆందోళనకు మద్దతు తెలిపారు. తమ విధులను ప్రశాంత వాతావరణంలో చేసే సిచుయేషన్ కల్పించాలని .. తమకు సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+