పొరబడ్డ 'దీదీ': మైక్ అనుకుని టార్చ్‌లైట్ పట్టుకుని.. (వీడియో)
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పొరబడ్డారు. కోల్‌కతాలో ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆమె.. మైక్ అనుకుని పొరపాటున టార్చ్‌లైట్ పట్టుకుని ప్రసంగించబోయారు.
మమతా వేదిక దిగడానికి వస్తున్న క్రమంలో.. ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేయగా ఆమె మైక్ అందుకోబోయారు. ఈ క్రమంలో మైక్ అనుకుని పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు చేతిలోని టార్చ్‌లైట్ తీసుకుని ప్రసంగించబోయారు.
ఆ సమయంలో టార్చ్ లైట్ ఆన్ చేసి ఉండటంతో మమత ముఖంపై లైట్ పడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మమతకు టార్చ్‌లైట్‌ని మైక్‌గా మార్చే పవర్ ఉందంటూ కొంతమంది నెటిజెన్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications