వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతా దాడి: ఎవరో కాదు.. కారు డోర్ తగిలి గాయం, ఇదీ ప్రత్యక్ష సాక్షుల వెర్షన్

|
Google Oneindia TeluguNews

నందిగ్రాంలో మమతా బెనర్జీ ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. కొందరు కావాలనే తన కారును అడ్డుకున్నారని.. ఐదుగురు దాడి చేశారని మమత ఆరోపించారు. అయితే దీనిని బీజేపీ ఇప్పటికే ఖండించింది. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షుల వంతు వచ్చింది. ఏం జరిగిందో వారు చెప్పడంతో దీదీ చెప్పింది అబద్దమా అనే సందేహం కలుగుతోంది.

ప్రచారం కోసం వచ్చిన సమయంలో నాలుగు, ఐదు మంది కలిసి తనపై దాడి చేశారని మమత ఆరోపించారు. అయితే ఆ సమయంలో తన కాలకి గాయమైందని కూడా చెప్పారు. బుధవారం సాయంత్రం 6.15 గంటలకు రెయపర వద్ద గల బిరులియాలో గల ఆలయంలో ప్రార్థనలు చేసి తిరిగి వెళ్తుండగా ఘటన జరిగింది. తాను కారులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారు బయటకు తీసేందుకు ట్రై చేశారని.. పెనుగులాటలో పడిపోయానని చెప్పారు. అయితే ప్రత్యక్షసాక్షులు వెర్షన్ మరోలా ఉంది. ఆమె ఎవరో నెట్టివేయడం వల్ల పడిపోలేదని.. తనంతట తానే అనుకోకుండా పడిపోయారని తెలిపారు. కారు డోర్ తగిలి పడ్డారే తప్ప.. మరొకటి కాదని చెప్పారు.

 Mamata Banerjee not attacked in Nandigram, got hurt from car door

ఆ సమయంలో సీఎంను చూడటానికి వచ్చారని విద్యార్థి సుమన్ తెలిపారు. పడిపోవడంతో మెడ, కాలుకి గాయం అయ్యిందని చెప్పారు. ఆమెను ఎవరూ నెట్టివేయలేదు.. చూడటానికే వచ్చారు. ఆ సమయంలో కారు మెల్లగా వెళుతుందని వివరించారు. మరో ప్రత్యక్ష సాక్షి చిత్రరంజన్ దాస్ ప్రకారం.. మమతా కారు నుంచి దిగే సమయంలో అక్కడున్న హోర్డింగ్ పడిపోయిందని చెప్పారు. దీంతో మమతా మెడ, మోకాలికి గాయం అయ్యిందని వివరించారు. ఇదిలా ఉంటే మమతా చూసేందుకు ఆస్పత్రికి వచ్చిన గవర్నర్‌కు చుక్కెదురైంది. టీఎంసీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఆయన వెనుదిరుగాల్సి వచ్చింది.

English summary
Chief Minister Mamata Banerjee being injured while campaigning in Nandigram, two eyewitnesses have now come forward to share what happened.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X