దీదీ మీ హెల్త్ రిపోర్ట్ చూపించండి.. మమతాకు అమిత్ షా ప్రశ్న..
బెంగాల్ ఎన్నికల్లో మాటల మంటలు కోటలు దాటుతున్నాయి. సీఎం మమతా బెనర్జీపై హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ రిపోర్ట్ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల నందిగ్రామ్‌లో తనను బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని దీదీ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అమిత్ షా స్పందించారు.
నందిగ్రామ్‌లో గాయపడ్డానని మమతా చెప్పి.. ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. అలా కాదంటే మెడికల్ రిపోర్ట్ బహిర్గతం చేయాలని.. దానిని బట్టి నిజ నిజాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పారు. బెంగాల్ ప్రజల అవసరాలను గుర్తించి మేనిఫెస్టో రూపొందించామని అమిత్ షా తెలిపారు. ఆయన మంగళవారం బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

బెంగాల్ ప్రజల సంక్షేమం కోసం పాటుపడతామని వివరించారు. బెంగాల్‌లో మహిళలకు రక్షన కల్పించడమే మా ప్రథమ ప్రాధాన్యం అని తెలిపారు. కానీ మమతా హయాంలో అన్నీ వ్యవస్థలు సరిగా పనిచేయడం లేదన్నారు. జవాబుదారీతనం లేదని.. ప్రజలు అంటే లెక్కలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications