బెంగాల్లో తీవ్రవాదులుంటే పహల్గాంలో దాడి? అమిత్ షాకు మమత కౌంటర్..!

వచ్చే ఏడాది జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ఇవాళ పశ్చిమబెంగాల్ లో మమత సర్కార్ పై విమర్శలు గుప్పించే క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ నుంచి తీవ్రవాదుల్ని తరిమేస్తాంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే వీటిపై గంటల వ్యవధిలోనే సీఎం మమతా బెనర్జీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

బెంగాల్లో వరుసగా మూడుసార్లు గెలిచి అధికారంలో ఉన్న మమతా బెనర్జీ సర్కార్ లో అవినీతి పెరిగిపోయిందని, రాష్ట్రంలో చొరబాటుదారులకు ఆశ్రయం ఇస్తూ జాతీయ భద్రతకు ప్రమాదకరంగా మారుతున్నారని అమిత్ షా ఇవాళ ఆరోపించారు. పౌరసత్వ చట్టం అమలు కాకుండా మమతా బెనర్జీ అడ్డుకోవడాన్ని ఆయన ప్రశ్నించారు. బెంగాల్ సరిహద్దుల గుండా అక్రమ చొరబాట్లు జరుగుతుంటే ఇక్కడి పోలీసులు ఏం చేస్తున్నారని మమతను అమిత్ షా నిలదీశారు. దీనిపై మమత తీవ్రంగా స్పందించారు.

Mamata Jabs Shah If Terrorists Are in Bengal Who Was Behind Pahalgam

బెంగాల్ ఉగ్రవాదుల కేంద్రంగా మారిందని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మమత.. జమ్మూ & కాశ్మీర్‌లో ఉగ్రవాదులు లేకపోతే, పహల్గామ్‌లో ఎలా జరిగింది? పహల్గామ్‌లో దాడి మీరే చేశారా? ఢిల్లీలో జరిగిన సంఘటన వెనుక ఎవరున్నారు?" అని అమిత్ షాకు ప్రశ్నలు గుప్పించారు. రాష్ట్రంలో రాజ్‌బన్షీలు, మతువాలు, ఆదివాసీలు వంటి అణగారిన వర్గాలను అమిత్ షా లక్ష్యంగా చేసుకుంటున్నారని మమత తెలిపారు. బెంగాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ పేరుతో 1.5 కోట్ల మంది పేర్లను తొలగించాలని అధికారులు యోచిస్తున్నారని ఆరోపించారు. దీన్ని బెంగాలీల ఓటు హక్కును తొలగించే ఉద్దేశపూర్వక ప్రయత్నంగా ఆమె అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+