Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి యత్నం.. ఆమె నివాసం ముందే..!
పశ్చిమ్ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై ఓ మహిళ కత్తితో దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. కాళీఘాట్ లోని దీదీ నివాసం ముందే ఈ ఘటన జరిగినట్లు టీఎంసీ స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఎంపీ డోలాసేన్ మాట్లాడుతూ.. ఓ గుర్తు తెలియని మహిళ వాలంటీర్ వేషంలో వచ్చి తన వద్ద ఉన్న కత్తితో మమతా బెనర్జీపై దాడి చేసేందుకు యత్నించింది.. అని పేర్కొన్నారు. ఇక ఇదే ఘటనపై టీఎంసీ మాజీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సాకేత్ గోకలే సోషల్ మీడియా మాధ్యమం అయిన ఎక్స్ లో పోస్టు చేశారు.
"డ్రగ్స్ కు అలవాటు పడిన ఓ మహిళ మమతా బెనర్జీ నివాసం లోకి వచ్చి దీదీపై కత్తితో దాడికి ప్రయత్నించింది. బెంగాల్ లో ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నా.. బెంగాల్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వాళ్లకే రక్షణ లేదు. ఈ దాడి దీదీపై బీజేపీ కావాలనే చేయించిందా..? ఎందుకంటే దిల్లీ నుంచి వాళ్లను తరిమికొట్టాలని దీదీ సంకల్పంతో ఉంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం" అని సాకేత్ గోకలే ఎక్స్ లో పోస్టు పెట్టారు. మరోవైపు ఈ ఘటనపై ఎంపీ డోలా కాళీఘాట్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
SHOCKING NEWS:A drug addict reached Mamata Banerjee’s residence today and tried to attack her with a knife. This is the condition in Bengal where even a Z+ protectee & 3-time CM is not safe. Was this a planned conspiracy by BJP because Didi is determined to finish them off in Delhi?A complaint has been filed. Will the police act or was this sanctioned by Amit Shah?
— Saket Gokhale (@SaketGokhale) October 13, 2026
అలాగే నిందితురాలిని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు తనిస్థా సాహాగా గుర్తించారు. ఆమె ఓ సివిల్ వాలంటీర్ కాగా.. ఆమె డ్రగ్ కు బానిస అని కూడా తేలింది. ఆమె మత్తులోనే ఈ దాడికి పాల్పడేందుకు యత్నించిందని టీఎంసీ నేతలు పోలీసులకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానికంగా దుర్గా పూజా కార్యక్రమాన్ని ప్రారంభించిన మమతా బెనర్జీ తిరిగి తన నివాసానికి వస్తున్న క్రమంలో ఈ దాడి జరిగింది.

ఈ ఘటన నేపథ్యంలో మమతా బెనర్జీకి కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్లపై టీఎంసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మమతకు తక్షణమే భద్రతను పెంచాలని సంబంధిత అధికారులను టీఎంసీ నేతలు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications
