అమ్మాయిల్ని బయట తిరగనీయొద్దు: గ్యాంగ్ రేప్ ఘటనపై మమతా సంచలనం
వెస్ట్ బెంగాల్ దుర్గాపుర్ లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గతంలోనూ బెంగాల్ కోల్ కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పశ్చిమ్ బెంగాల్ లో వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు, అమ్మాయిలను రాత్రిళ్లు బయట తిరగనీయొద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దుర్గాపుర్ లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు, మహిళల్ని రాత్రిళ్లు బయట తిరగనీయొద్దని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యార్థినులను రాత్రిళ్లు బయటకు పంపించకుండా కాలేజీ యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. దీదీపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. మహిళలకు రక్షణ కల్పిస్తామని మూడోసారి అధికారం చేపట్టిన టీఎంసీ పార్టీ ఇప్పుడు నేరస్థులకు కొమ్ము కాస్తోందంటూ మండిపడుతున్నాయి.
" కాలేజీలోని అమ్మాయిలను రాత్రిళ్లు బయటకు పంపించొద్దు. వాళ్లను వాళ్లే కాపాడుకోవాలి. దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ ఘటన అడవిలో జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరినీ విడిచిపెట్టం. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు వేగంగా సాగుతోంది" అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిషాలోని జలేశ్వర్ కు చెందిన 20 ఏళ్ల వైద్య విద్యార్థిని దుర్గాపూర్ లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. అక్టోబర్ 10, శుక్రవారం రాత్రి తన ఫ్రెండ్ తో కలిసి డిన్నర్ చేసేందుకు కాలేజీ నుంచి బయటకు వెళ్లింది. అయితే ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

బాధితురాలి ఫోన్ ను లాక్కుని అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమందిని గాలిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకుని వివరాలను సేకరించింది. ఈ ఘటనతో బెంగాల్ తో పాటు దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరిన్ని కఠినమైన పాలసీలు, చట్టాలు తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications