"ఆమెపై 8 మంది టీచర్లు 17 నెలలు రేప్ చేసి, వీడియో తీశారు"
తన కూతురిపై ఎనమండుగురు టీచర్లు సామూహిక అత్యాచారం చేసి, వీడియో తీశారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బిక్నూరు: తన కూతురిపై ఎనిమిది మంది ఉపాధ్యాయులు అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. రాజస్థాన్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన 2105 ఏప్రిల్‌లో జరిగింది.
ఆ 13 ఏళ్ల బాలికపై 8 మంది టీచర్లు కలిసి 17 నెలలపాటు గ్యాంగ్‌రేప్ చేశారు. కేన్సర్ లాంటి లక్షణాలతో బాధపడుతున్న తన కుమార్తెపై దారుణానికి పాల్పడడమే కాకుండా గర్భం దాల్చకుండా మందులు కూడా ఇచ్చారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. కేసును విచారించేందుకు ప్రభుత్వం మహిళా ప్యానెల్‌ను నియమించింది.
ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసు సూపరింటిండెంట్‌కు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు. దాంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ దర్జారామ్ చెప్పారు. అంతకు ముందు ఓ ఉపాధ్యాయుడు నలుగురు వ్యక్తులపై కేసు పెట్టాడు. వారిలో ఇద్దరు అమ్మాయి కజిన్స్ ఉన్నారు.
మార్చి 20వ తేదీన తనను కొట్టినందుకు అతను ఆ కేసు పెట్టాడు. ఈ రెండు కేసులపై కూడా విచారణ చేస్తున్నట్లు దర్జారామ్ చెప్పారు.












Click it and Unblock the Notifications