మరొకరితో ప్రియురాలి పెళ్లి: 2సార్లు కిడ్నాప్, పలు ప్రాంతాల్లో తిప్పుతూ రేప్ చేశాడు
కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త ఊరిలో లేని సమయంలో ఓ వివాహతను కిడ్నాప్ చేసిన ఆమె మాజీ ప్రియుడు.. పలు ప్రాంతాల్లో తిప్పుతూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త ఊరిలో లేని సమయంలో ఓ వివాహతను కిడ్నాప్ చేసిన ఆమె మాజీ ప్రియుడు.. పలు ప్రాంతాల్లో తిప్పుతూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

భార్య కోసం భర్త..
భార్య ఇంట్లో లేకపోవడంతో ఆందోళన చెందిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, కొద్ది రోజుల తర్వాత నిందితుడి బారినుంచి తప్పించుకున్న సదరు మహిళ కూడా భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా రెండుసార్లు జరిగింది. దీంతో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

బాధిత మహిళను ప్రేమించిన వ్యక్తే..
గతంలో బాధిత మహిళను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించాడు నిందితుడు. కానీ, ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి జరిగింది. కాగా, ఫిర్యాదు చేసిన మహిళ గత జనవరిలో కనిపించడంలేదంటూ ఆమె భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రెండుసార్లు కిడ్నాప్ చేసి..
ఆమె రాజస్థాన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించి నగరానికి తీసుకొచ్చి భర్తకు అప్పగించారు. మళ్లీ ఏప్రిల్‌లో మాయమవడంతో ఆమె భర్త పోలీసులకు మళ్లీ ఫిర్యాదు చేశాడు. ఆ మహిళ రాజస్థాన్‌లో మాజీ ప్రియుడు అర్జున్‌సింగ్‌తో కలిసి ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

పలు ప్రాంతాల్లో తిప్పుతూ..
ఈసారి కూడా ఆమెను నగరానికి తీసుకొచ్చి భర్తకు అప్పగించారు. తన భర్త ఇంట్లో లేని సమయంలో నిందితుడు తన ఇంటికి వచ్చి బలవంతంగా అపహరించుకెళ్లి మైసూరు, మంగళూరు ప్రాంతాల్లో తిప్పి అత్యాచారానికి పాల్పడినట్లు ఆ మహిళ భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దాఖలు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మాములుపేటలోని దుస్తుల దుకాణంలో పని చేస్తున్నట్లు గుర్తించామని, అతడి కోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications