భార్యను తిట్టిందని అమ్మను అంతం చేశాడు

మధప్రదేశ్: అత్తాకోడల మధ్య అలకలు, ఒకరి మీద ఒకరికి కోపాలు, కొట్లాటలు సర్వసాధారణమైన విషయం. అయితే ఇంటి పని సరిగా చెయ్యలేదని కోడలిని మందలించిన మహిళ అతని సొంత కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన మధప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

మధ్యప్రదేశ్ లోని ఆలీరాపుర సమీపంలోని అజంద గ్రామంలో నివాసం ఉంటున్న సానిబాయి (60) అనే మహిళ హత్యకు గురైంది. సానిబాయిని హత్య చేసిన ఆమె కుమారుడు అమన్ సింగ్ (35) అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని ఆలీరాపుర సబ్ డివిజన్ పోలీసు అధికారి ఆనంద్ సింగ్ తెలిపారు.

man allegedly killed his mother today after she scolded his wife

అమన్ సింగ్, సంగీత దంపతులు. సంగీత ఇంటి పని సక్రమంగా చెయ్యడం లేదని సానిబాయి అప్పుడప్పుడు మందలించేది. ఎప్పటిలాగే సోమవారం ఇంటి పని సక్రమంగా పూర్తి చెయ్యాలని, తరువాత వంట చెయ్యాలని సానిబాయి కోడలిని మందలించింది.

ఆ సందర్బంలో ఇంటిలోనే ఉన్న అమన్ సింగ్ నా భార్యనే మందలిస్తావా అంటు రెచ్చిపోయాడు. కోపోద్రిక్తుడై తల్లి గొంతు నులిపి దారుణంగా చంపేశాడు. కోపం తగ్గిపోయిన తరువాత చూసుకునే సరికి తల్లి శవమైయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు అమన్ సింగ్ ను అరెస్టు చేశారు. అమన్ సింగ్ ఇద్దరు సోదరులతో కలిసి గుజరాత్ లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. గత వారమే అతను ఇంటికి వచ్చాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+