భర్త డ్రగ్స్ బానిస: భార్య మీద ఏడు మంది స్నేహితులతో రేప్ చేయించాడు, వీడియోలు తీసి !

Posted By:
Subscribe to Oneindia Telugu

పంజాబ్: డ్రగ్స్ కు బానిస అయిన భర్త విలాసవంతమైన జీవితం గడపడానికి అతని భార్యను ఫలంగా పెట్టి ఏడు మంది స్నేహితులతో అత్యాచారం చేయించిన దారుణ ఘటన పంజాబ్ లోని లూథియానా సమీపంలోని డాఖా ప్రాంతంలో జరిగింది.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పోలీసు అధికారి నగర్ సింగ్ శుక్రవారం మీడియాకు చెప్పారు. డాఖాలో నివాసం ఉంటున్న 29 ఏళ్ల యువకుడితో 25 ఏళ్ల యువతికి 2011లో వివాహం అయ్యింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.

Man allows 7 friends to rape wife to meet his drug in Punjab

పెళ్లి అయినా అతను డ్రగ్స్ కు బానిస అయ్యాడు. విలాసవంతమైన జీవితం గడపడానికి స్నేహితుల దగ్గర అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక తన రుణం మాఫీచేస్తే నా అందమైన భార్యను అనుభవించడానికి మీకు చక్కటి అవకాశం ఇస్తానని స్నేహితులకు చెప్పాడు.

ఇదే సంవత్సరం జూన్ నెల నుంచి ఒక్కక్కరితో అతని భార్య మీద అత్యాచారం చెయ్యడానికి అవకాశం కల్పించాడు. భార్య మీద అత్యాచారం చేసే సమయంలో మొబైల్ లో వీడియో, ఫోటోలు తీశాడు. నేను చెప్పినట్లు వినకుంటే ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతానని భార్యను బెదిరించాడు. భర్త స్నేహితులు పదేపదే అత్యాచారం చెయ్యడానికి రావడంతో విసిగి పోయిన భార్య ఫిర్యాదు చేసిందని పోలీసు అధికారి నగర్ సింగ్ చెప్పారు. బాధితురాలి భర్తతో పాటు అతని ఏడు మంది స్నేహితుల మీద కేసు నమోదు చేశామని పోలీసు అధికారి నగర్ సింగ్ తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a bizzare incident a man offered his wife to seven of his friends to get raped to finance his drug addiction. The 25-yr-old victim, a mother of a child.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X