hyderabad army vinod kumar indian army arrest nia హైదరాబాద్ ఆర్మీ వినోద్ కుమార్ ఇండియన్ ఆర్మీ అరెస్ట్
హైదరాబాదులోని డిఫెన్స్ కాలేజీ వద్ద నకిలీ ఎన్ఐఏ గుర్తింపు కార్డుతో పట్టుబడిన వ్యక్తి, అరెస్ట్
హైదరాబాద్: నకిలీ గుర్తింపు కార్డుతో హైదరాబాదులోని సైనిక్‌పురి సీడీఎం (కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్) వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వినోద్ కుమార్ అనే వ్యక్తిని ఆర్మీ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో అతని నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ (ఎన్ఐఏ) ఐడెంటిటీ కార్డును, మరియు ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఆధార్ కార్డులో అతని పేరు వినోద్ కుమార్ రెడ్డి కడప జిల్లాగా గుర్తించారు.

ఎన్ఐఏ ఐడెంటిటీ కార్డును ఫేక్‌గా గుర్తించారు. అనంతరం పోలీసులు అతనిని నేరెడ్‌మెంట్ పోలీసులకు అప్పగించారు. నేరెడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.