వామ్మో.. పెళ్లి సర్టిఫికెట్ అడిగితే మళ్లీ చేసుకోమ్మన్నారు.. అధికారులపై సస్పెన్షన్ వేటు

తిరువనంతపురం : కొందరు అధికారులు సామాన్యులను ఇబ్బంది పెడుతుంటారు. తమకు ప్రాధాన్యమైన సర్టిఫికెట్ ఇవ్వమని అడిగితే చుక్కలు చూపిస్తారు. ఆ ధ్రువపత్రం, ఈ సర్టిఫికెట్ అంటూ ఆఫీసు చుట్టు చెప్పులరిగేలా తిప్పుకుంటారు. కేరళలో కూడా అధికారుల బృందం ఇలానే తిప్పింది. అయితే తనకు జరిగిన అవమానాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో .. కేరళ సర్కార్ స్పందించింది. హేళనగా మాట్లాడి, సర్టిఫికెట్ ఇవ్వని అధికారులను సస్పెండ్ చేసి మిగతా అధికారుల వెన్నుల వణుకు పుట్టేట్టు చేసింది.

తీరు.. సరికాదు.
కోజికోడ్లోని ముక్కానికి చెందిన పీ మధుసూదన్ 16 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే అతనికి మ్యారే్జ్ సర్టిఫికేట్ అవసరం వచ్చింది. అదీ కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద.. దీంతో అధికారులను తనకు సర్టిఫికేట్ ఇవ్వమని కోరారు. అయితే తలపొగరు ఉన్న అధికారులు రేపు, మాపు అని తిప్పారు. దీంతో కార్యాలయం ముందే నిరసనకు దిగారు. దీంతో కోపోద్రిక్తులైన అధికారులు మళ్లీ పెళ్లి చేసుకోవాలని తలతిక్క సమాధానం చెప్పారు. దీంతో మదనపడ్డ మదుసూదన్ జరిగిన అవమానం గురించి తన స్నేహితుడికి చెప్పాడు. దీంతో ఆయన సోషల్ మీడియాలో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయమని సలహా ఇచ్చారు. ఇంకేముంది ఫేస్ బుక్‌లో వైరలవడంతో కేరళ ప్రభుత్వం స్పందించింది.

Man asks for marriage certificate after 16 yrs. Officials say, remarry

అధికారుల తీరును తప్పుపట్టింది. మధుసూదన్‌తో తప్పుగా ప్రవర్తించిన అధికారులను సస్పెండ్ చేసింది. ఈ మేరకు కేరళ మంత్రి జీ సుధాకరన్ మీడియాకు వెల్లడించారు. పిటిషన్ దారుతో అధికారుల తీరు సరికాదని మంత్రి ఖండించారు. దానిని తమ ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టంచేశారు. మధుసూదన్‌ను ఇబ్బందికి గురిచేసిన అధికారులపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+