ఓటరు కార్డు ఇవ్వలేదని తల్లిని చంపేశాడు
జంషడ్ పూర్: ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు కనపడకపోవడంతో ఊగిపోయిన ఓ కొడుకు తల్లిని గొడ్డలితో నరికి అతి దారుణంగా హత్య చేసిన సంఘటన జంషడ్ పూర్ సమీపంలోని ఇచద్రా గ్రామం లో జరిగింది.
ఆదివారం ఇచద్రా గ్రామంలో స్థానిక ఎన్నికలు (పంచాయితీ ఎన్నికలు) జరిగాయి. ఇదే గ్రామంలో కౌషాలియా (55) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఈమె కుమారుడు కతి(35). ఆదివారం కతి ఇంటికి వెళ్లి ఓటరు గుర్తింపు కార్డు ఇవ్వాలని తల్లిని అడిగాడు.

ఆమె ఇంటిలో గాలించింది. ఎంతసేటికి ఓటరు గుర్తింపు కార్డు చిక్కలేదు. కనీసం ఆదార్ కార్డు ఇవ్వాలని చెప్పాడు. ఇల్లు మొత్తం గాలిస్తున్నా ఆధార్ కార్డు సైతం కనపడలేదు. ఆ సందర్బంలో తల్లిని ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టాడు.
తరువాత సహనం కొల్పోయిన కతి ఇంటిలో ఉన్న గొడ్డలి తీసుకుని తల్లి కౌషాలియాపై ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. తీవ్రగాయాలైన ఆమె సంఘటనా స్థలంలోనే మరణించారని పోలీసులు చెప్పారు. తల్లిని హత్య చేసిన కతి తప్పించుకుని పరారైనాడని పోలీసులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications